Apple Hebbal: దక్షిణ భారతదేశంలో ఆపిల్ తన మొదటి ఆపిల్ స్టోర్‌ని ప్రారంభించింది. మంగళవారం రోజు బెంగళూర్ నగరంలో ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో ఆపిల్ కంపెనీ తన పూర్తి యాజమాన్యంలో రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. దీనిని ‘‘ఆపిల్ హెబ్బాల్’’గా పిలుస్తారు. 2023లో ముంబైలోని బాంద్రా కుర్లా కాంపెక్స్ ఆపిల్ తన మొదటి స్టోర్‌ని ఓపెన్ చేసింది. దీని తర్వాత ఢిల్లీలోని సాకేత్‌లో రెండో స్టోర్‌ని, ఇప్పుడు బెంగళూర్‌లో తన మూడో స్టోర్‌ని ప్రారంభించింది.
Read Also: Glacial Lakes: హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు, ఎప్పుడైనా ముప్పు: తాజా రిపోర్ట్..
ఈ స్టోర్‌లో పనిచేసేందుకు 70 మంది టీమ్ 15 రాష్ట్రాల నుంచి వచ్చారు. వీరు కన్నడ, హిందీ, 25 ఇతర ప్రాంతీయ భాషల్లో కస్టమర్లతో మాట్లాడగలరు. దేశంలోని రెండు స్టోర్లతో పోలిస్తే ఆపిల్ హెబ్బల్ చిన్నగా ఉంటుంది. ఆపిల్ ఉత్పత్తులైన ఐఫోన్‌లు, మ్యాక్ బుక్స్, ఐమాక్, ఐఫ్యాడ్, ఆపిల్ టీవీలు, వాచీలు, ఆపిల్ పెన్సిల్, ఎయిర్ ట్యాగ్స్‌లు కోసం ప్రత్యేక కౌంటర్లతో ఓపెన్ లేఅవుట్‌లను కలిగి ఉంది. ఈ స్టోర్ నుంచి ప్రజలు ఆఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్ నుంచి లేదా ఆపిల్ యాప్‌లో ఆర్డర్ చేసుకోవడంతో పాటు స్టోర్‌లో పరికరాలను కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం బెంగళూర్‌లో స్టోర్ ప్రారంభించిన ఆపిల్, సెప్టెంబర్ 4న పూణేలో ఆపిల్ కోరేగావ్ పార్క్ స్టోర్‌ని ప్రారంభించనుంది. ఈ ఏడాది చివర్లో ఆపిల్ ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మరో రెండు స్టోర్లను తెరవాలని భావిస్తోంది. వీటిలో దేశంలో యాపిల్ స్టోర్ల సంఖ్య 6కు చేరుతుంది.
#WATCH | Bengaluru, Karnataka: Apple opened its first store in South India, 'Apple Hebbal' in Bengaluru.
This is Apple's third store in the country, following Apple BKC in Mumbai and Apple Saket in Delhi. pic.twitter.com/8SIPEaEaYa
— ANI (@ANI) September 2, 2025