ఎనర్జీ డ్రింక్స్ వినియోగం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తోందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరికైనా అధిక కెఫిన్ కలిగిన ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను నిషేధించాలని యూకే ప్రభుత్వం ప్రకటించింది. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని ఆధారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. యూకే ప్రభుత్వ డేటా ప్రకారం, ప్రతిరోజూ దాదాపు 100,000 మంది పిల్లలు కనీసం […]
టెలికాం రంగంలో సంచలనాలకు తెరలేపిన రిలయన్స్ జియో అప్పుడే 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఉచిత సిమ్, ఉచిత డాటా ఆఫర్లతో అడుగుపెట్టి కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. జియో ఇటీవల 50 కోట్ల వినియోగదారుల సంఖ్యను తాకింది. జియో 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, కంపెనీ యూజర్ల కోసం బంపరాఫర్లను ప్రకటించింది. అందరికీ 3 రోజుల పాటు ఉచిత అపరిమిత డేటా.. జియో ఒక నెల రీఛార్జ్‌ను కూడా ఉచితంగా […]
రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. RCFLలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 325 పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలో గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అలాగే, అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులతో డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల కంటే […]
గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించనందుకు జపాన్ పర్యాటకుడికి జరిమానా విధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పర్యాటకుడు హెల్మెట్ లేకుండా స్కూటర్ వెనుక సీటుపై కూర్చున్నాడు. పోలీసులు అతనికి జరిమానా విధించినప్పుడు వీడియో తీశాడు. సాధారణంగా, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న ప్రయాణీకుడు రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ చలాన్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ వైరల్ వీడియోలో, గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది జపాన్ పర్యాటకుడి నుండి రూ. […]
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం న్యూఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025 ఈవెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా పీఎం మోడీ భారతదేశపు మొట్టమొదటి చిప్‌సెట్‌ను ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా కూడా పాల్గొన్నారు. మోడీ విక్రమ్ 32-బిట్ ప్రో చిప్‌ను ప్రదర్శించారు. సెమీకండక్టర్ చిప్ ఒక సిలికాన్ సర్క్యూట్ బోర్డ్ లాంటిది. ఈ చిప్ ఏదైనా పరికరం లేదా గాడ్జెట్‌కి.. మానవునికి […]
భారతీయ రైల్వేలలో పనిచేస్తున్న దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులు, 15 లక్షల మంది పెన్షనర్లకు ఒక శుభవార్త . దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో రైల్వే మంత్రిత్వ శాఖ చేతులు కలిపింది. ఈ రెండింటి మధ్య ఒక ఒప్పందం (MoU)కుదిరింది. ఉద్యోగులకు బీమా ప్రయోజనాలను అందించడానికి ఈ ఒప్పందం జరిగింది. నిన్న సాయంత్రం రైల్ భవన్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్, […]
భారత్ లోకి అక్రమంగా చొరబడే వారిపై ఉక్కుపాదం మోపనుంది సర్కార్. భారత్ లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను, ఇమ్మిగ్రేషన్ విషయాలను నియంత్రించడానికి రూపొందించిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం, 2025 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిల్లు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందింది. ఏప్రిల్ 4, 2025న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నితేష్ కుమార్ వ్యాస్ […]
గోల్డ్ ధరలు వరుసగా పెరుగుతూ షాకిస్తున్నాయి. నేడు మళ్లీ భారీగా పెరిగాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 210 పెరిగింది. కిలో సిల్వర్ ధర రూ. 100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,609, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,725 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగింది. […]
క్రికెట్ ఆడుతూ.. ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు తమతో ఉన్నవారు విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోతుండడంతో తట్టుకోలేకపోతున్నారు. తాజాగా కేరళలో విషాదం చోటుచేసుకుంది. ఓనం పండుగ సందర్భంగా కేరళ విధాన సభలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో కొంతమంది పురుష, మహిళా ఉద్యోగులు వేదికపై డ్యాన్స్ చేశారు. తోటి ఉద్యోగులు వారిని కేరింతలతో ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ, ఇంతలోనే డ్యాన్స్ చేస్తున్న వారిలో ఒకరు అకస్మాత్తుగా పడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న […]
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించనున్నారు. ఇది భారత్ లోనే అతిపెద్ద సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ షో. ఇందులో 33 దేశాల నుంచి 350 కి పైగా టెక్ కంపెనీలు పాల్గొనబోతున్నాయి. సెమీకండక్టర్ పరిశ్రమలో భారతదేశాన్ని సూపర్ పవర్‌గా మార్చడం, సాంకేతిక ప్రపంచంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమం లక్ష్యం. పీఎం మోడీ సోమవారం సాయంత్రం X ఖాతాలో ఓ పోస్ట్ పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 2న ఉదయం 10 […]