నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ షాకిచ్చాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 760 పెరిగింది. దీంతో తులం పసిడి ధర రూ. లక్షా ఏడు వేలు దాటింది కిలో సిల్వర్ ధర రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,762, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,865 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 […]
కొన్ని ప్రేమలు పెళ్లి పీటలెక్కుతుంటే.. మరికొన్ని ప్రేమలు కాటికి చేరుతున్నాయి. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో తనువులు చాలిస్తున్నారు కొందరు యువతీ యువకులు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అన్న వరస అవుతాడని ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ప్రేమను వదులుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. Also Read:Sri Lanka: శ్రీలంకలో ఘోర విషాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారు. జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గించారు. జపాన్ వాహనాలు, ఇతర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం జూలైలో కుదిరిన ఒప్పందం అమలులో భాగం. అమెరికా, జపాన్ మధ్య నెలల తరబడి జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం జపాన్ ఆటో పరిశ్రమకు ఉపశమనం కలిగించడమే కాకుండా, అమెరికాలో జపాన్ $550 బిలియన్ల పెట్టుబడికి మార్గం సుగమం […]
అంగరంగ వైభవంగా కొనసాగిన గణేష్ ఉత్సవాలు నిమజ్జనం దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పలువురు భక్తులు విఘ్నేషుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. అయితే నిమజ్జన సమయంలో వినాయకుడి ఫొటోలు, వీడియోలు తీయడం.. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇలాంటి వారికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. గణేష్ విగ్రహ నిమజ్జనం ఫోటోలు, వీడియోలు తీయడం, షేర్ చేయడంపై నిషేధం విధించారు. అయితే ఇది తెలంగాణలో కాదు మహారాష్ట్రలో. పూణే పోలీసులు గురువారం ఒక ఉత్తర్వులను […]
గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గణపయ్యకు వీడ్కోలు పలికేందుకు భక్తులు రెడీ అయ్యారు. తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న గణనాథులను శుక్రవారం సాగనంపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనుమకొండ ప్రాంతంలో 14 చెరువులు, వరంగల్‌లో 7 తటాకాలలో నిమజ్జనం జరగనుంది. శోభయాత్ర జరిగే రహదారుల పొడవునా విద్యుత్ లైట్లు అమర్చారు. బారికేడ్లతో పాటు 28 క్రేన్లు, తెప్పలు సిద్ధంగా ఉంచారు. అందుబాటులో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. Also Read:USA: “భారతీయుల వల్లే ఉద్యోగాలు […]
యూరప్, పశ్చిమ దేశాలు భారత్ తో గౌరవప్రదమైన, సహకార విధానాన్ని అవలంబించాలని, లేకుంటే మనమందరం ప్రపంచ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ స్పష్టం చేశారు. భారతదేశంపై విధించిన సుంకాలపై కూడా ఆయన పరోక్షంగా ట్రంప్‌ను విమర్శించారు. లిథువేనియా అధ్యక్షుడు గీతానాస్ నౌసేడాతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో స్టబ్ మాట్లాడుతూ, షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ సౌత్ శక్తి గురించి పశ్చిమ దేశాలను హెచ్చరించిందని అన్నారు. […]
ప్రభుత్వ ఉద్యోగానికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆఖరికి అటెండర్ ఉద్యోగమైనా సరే గవర్నమెంట్ జాబ్ మాత్రమే కావాలని పట్టుబడుతుంటారు. కానీ ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి కేవలం 3 సంవత్సరాలలో రాజీనామా చేయాలని ఆలోచిస్తాడని ఎవరైనా ఊహిస్తారా?. కానీ ఓ యువతి మాత్రం ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాన్ని వదిలేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పనిచేస్తున్న వాణి అనే 29 ఏళ్ల యువతి 2020 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం పొంది 2025 లో రాజీనామా […]
ఐఐటీ స్టూడెంట్ ఆకస్మిక మరణం.. తోటి విద్యార్థులతో పాటు కుటుంబీకులను షాక్ కు గురిచేసింది. తెల్లవారితే పరీక్ష ఉందని అర్థరాత్రి వరకు చదువుకున్న విద్యార్థి.. కానీ పరీక్షకు ముందే ఉదయం వేళ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వారణాసిలోని IIT-BHUలో చోటుచేసుకుంది. MTech విద్యార్థి అనూప్ సింగ్ చౌహాన్ బుధవారం ఉదయం పరీక్ష రాయాల్సి ఉంది. మంగళవారం రాత్రి, అతను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక గదిలో చదువుకున్నాడు. ముగ్గురు తెల్లవారుజామున 3 గంటల వరకు […]
ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత, టీం ఇండియాకు చెందిన మరో స్పిన్నర్ క్రికెట్లోని మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను మరెవరో కాదు.. టీం ఇండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా. తన 25 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. టీం ఇండియా లెజెండరీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అమిత్ మిశ్రా IPLలో కూడా ఒక స్టార్. ఈ ఫార్మాట్లో 3 హ్యాట్రిక్‌లు […]
ప్రయాణాల్లో ఒక్కోసారి అనుకోకుండా జరిగే పరిచయాలు ప్రేమకు దారితీస్తాయి. ఇలాగే ఓ యువతి ట్రైన్ జర్నీ చేస్తున్న సమయంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకుంది. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఓ బిడ్డకు తల్లైంది. కానీ ఇప్పుడు తన 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇంతకీ ఏం జరిగిందంటే? ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన రాధ అనే మహిళ ఇప్పుడు తన 11 నెలల బిడ్డతో పోలీస్ […]