కొలంబోలో జరిగిన తొలి అంధుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో నేపాల్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి భారత మహిళా క్రికెట్ జట్టు టైటిల్ సొంతం చేసుకుని సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా అంధుల క్రికెట్ జట్టును కలిశారు. తొలి అంధుల మహిళల T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్నందుకు వారిని వ్యక్తిగతంగా అభినందించారు. కృతజ్ఞతా చిహ్నంగా మహిళా క్రికెటర్స్ ప్రధానమంత్రికి ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాట్‌ను బహూకరించారు. టోర్నమెంట్ అంతటా వారి ధైర్యాన్ని, క్రమశిక్షణను, ప్రశాంతతను ప్రశంసిస్తూ, మోడీ జట్టు కోసం క్రికెట్ బంతిపై సంతకం చేశారు.
Amaravati Farmers: రాజధాని ప్రాంత రైతులతో చంద్రబాబు సమావేశం.. రెండవ దశ భూ సమీకరణకు రైతుల అంగీకారం..!
ఎక్స్ లో స్పందిస్తూ.. మొదటి అంధుల మహిళల T20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించినందుకు భారత అంధుల మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు! సిరీస్‌లో వారు అజేయంగా నిలిచారనేది మరింత ప్రశంసనీయం అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు. వారి భవిష్యత్ ప్రయత్నాలకు జట్టుకు నా శుభాకాంక్షలు. ఈ ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది అని పీఎం తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆటగాళ్లకు రివార్డులను ప్రకటించారు. కర్ణాటకకు చెందిన జట్టు సభ్యులకు 10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలను అందివ్వనున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 2 లక్షలు అందిస్తారు. ఈ ప్రకటన ద్వారా 13 మంది కర్ణాటకేతర ఆటగాళ్లు ప్రయోజనం పొందనున్నారు.