ఇండోనేషియాలో ఓ స్కూల్ బిల్డింగ్ కూలిపోయింది. పాఠశాల భవనం కూలిపోవడంతో డజన్ల కొద్దీ పిల్లలు శిథిలాలలో చిక్కుకున్నారు. ముగ్గురు విద్యార్థులు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగి రెండు రోజులు గడిచినా, 91 మంది విద్యార్థులు ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులకు సహాయక సిబ్బంది నీరు, ఆక్సిజన్ అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Also Read:MP Mithun Reddy: ఒక ఉగ్రవాదిలా నన్ను జైల్లో పెట్టారు.. సీసీ కెమెరా […]
ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ నుంచి కొత్త టాబ్లెట్ విడుదలైంది. సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+, స్టాండర్డ్ గెలాక్సీ ట్యాబ్ A11 తో పాటు ప్రారంభించారు. గెలాక్సీ ట్యాబ్ A11+ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 11-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. వన్ UI 8.0 ఇంటర్‌ఫేస్‌పై పనిచేస్తుంది. స్టాండర్డ్ గెలాక్సీ ట్యాబ్ A11 లాగా, గెలాక్సీ ట్యాబ్ A11+ కూడా రెండు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,040mAh […]
మైనర్ లపై అత్యాచారాలకు పాల్పడితే పోక్సో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. తాజాగా బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నా పోక్సో కోసు రద్దు కాదని కోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన 29 ఏళ్ల యువకుడు తనపై నమోదైన రేప్ కేసును రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తిరస్కరించింది. […]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) MPC సమావేశ ఫలితాలు వెల్లడయ్యాయి. సెప్టెంబర్ 29న ప్రారంభమైన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ, RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఈసారి రెపో రేటుపై కీలక ప్రకటన చేశారు. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదని తెలిపారు. రెపో రేటు 5.5 శాతం యథాతథం ఉంచినట్లు వెల్లడించారు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ తెలిపింది. రుణ EMIపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ఆగస్టు తర్వాత, అక్టోబర్‌లో వడ్డీ […]
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC), భారత జాతీయ కాంగ్రెస్ (INC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ చికిత్స ప్రారంభించారు. వర్గాల సమాచారం ప్రకారం, మంగళవారం రాత్రి ఖర్గేకు నిరంతర జ్వరం రావడంతో బెంగళూరులోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. ఖర్గే ఆసుపత్రిలో చేరిన వార్త దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, […]
హైదరాబాద్‌కు చెందిన ఈక్వల్ AI కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కాలర్ అసిస్టెంట్‌ను ప్రారంభించబోతోంది. ఈ యాప్ అక్టోబర్ 2 నుండి అందుబాటులోకి వస్తుంది. ఢిల్లీ NCRలో మొదటి 10,000 మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్చి 2026 నాటికి ప్రతిరోజూ 1 మిలియన్ వినియోగదారులను చేరుకోవడమే లక్ష్యం అని కంపెనీ వ్యవస్థాపకుడు CEO కేశవ్ రెడ్డి అన్నారు. ఈ యాప్ తెలియని కాల్స్ కు సమాధానం ఇస్తుంది. […]
భారతదేశంలో ఇంజనీరింగ్ అంటే విపరీతమైన క్రేజ్. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయ విద్యార్థులు దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి అవసరమైన JEE పరీక్ష రాస్తారు. IITలు, NITలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ చేయాలని కలలుకంటుంటారు. అయితే భారత్ లో ఇంజనీరింగ్ డిగ్రీని సాధారణంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ( B.Tech ) అని పిలుస్తారు. కొన్ని ప్రదేశాలలో, దీనిని బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (BE) డిగ్రీ అని కూడా పిలుస్తారు. B.Tech అనేది […]
పండగ వేళ వినియోగదారులకు షాకిచ్చాయి చమురు కంపెనీలు. ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు LPG సిలిండర్ ధరలను సమీక్షించి, సవరించి, కొత్త రేట్లను జారీ చేస్తాయి. ఇవాళ అక్టోబర్ 01న దేశంలో LPG సిలిండర్ ధరలు రూ. 16 వరకు పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఢిల్లీ నుండి ముంబై వరకు, కోల్‌కతా నుండి చెన్నై వరకు LPG ధరలను పెంచాయి. అయితే, 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో ఈ పెరుగుదల […]
13 సంవత్సరాల తర్వాత, పోస్టల్ డిపార్ట్మెంట్ స్పీడ్ పోస్ట్ ఛార్జీలను సవరించింది. పార్శిల్ రేట్లను పెంచింది. 50, 250, 500 గ్రాముల స్పీడ్ పోస్ట్ పార్శిల్ల బుకింగ్ ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం జరుగుతుంది. స్పీడ్ పోస్ట్ కొత్త ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. 2,000 కిలోమీటర్ల వరకు పంపిన స్థానిక, పార్శిల్‌లకు వేర్వేరు రేట్లు నిర్ణయించారు. వినియోగదారులు అదనంగా 5 శాతం GST చెల్లించాల్సి ఉంటుంది. Also Read:Oppo A6 5G: 7000mAh బ్యాటరీ, […]
ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దేశంలోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, ఇళ్లు, కార్యాలయాల నుండి బయటకు పరుగులు తీశారని అధికారి తెలిపారు. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా అనేక భవనాలు కూలిపోయి కనీసం 20 మంది మరణించారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. భూకంప కేంద్రం, ప్రభావిత ప్రాంతాల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే ప్రాథమిక నివేదికలు గణనీయమైన ఆస్తి […]