పల్సర్ బైకులకు క్రేజీ డిమాండ్ ఉంటుంది. బైక్ లవర్స్ పల్సర్ బైకులకే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. స్టన్నింగ్ లుక్, మైలేజ్, క్వాలిటీ పరంగా బెస్ట్ గా ఉంటుండడంతో ఈ బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా అప్ డేటెడ్ వర్షన్ లతో బజాజ్ కంపెనీ సరికొత్త బైకులను మార్కెట్ లోకి తీసుకొస్తున్నది. తాజాగా బజాజ్ కంపెనీ తన పాపులర్ బైక్ పల్సర్ ఎన్ఎస్ 125ను కొత్త అప్ డేట్ లతో రిలీజ్ చేసింది. […]
జగిత్యాల జిల్లాలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో భారీ చోరీకి పాల్పడ్డారు. పొలం పనులకు వెళ్లి తిరిగొచ్చేలోపే 14 తులాల బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న మహిళకు ఊహించని షాక్ తగిలింది. తాళం వేసి ఉన్న ఇళ్లు చోరికి గురికావడంతో లబోదిబోమన్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏనుగు పద్మ అనే మహిళ ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు […]
AICC: పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్చార్జిలను ప్రకటించింది. 9 రాష్ట్రాలకు కొత్త ఇన్ ఛార్జులను ప్రకటించిన కాంగ్రెస్.. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా కొనసాగుతున్న దీపాదాస్ ను తొలగించిన ఏఐసీసీ.. తెలంగాణకు కొత్త ఇంచార్జిని నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మీనాక్షి నజరాజన్ 2009లో మధ్యప్రదేశ్ లోని మాండసోర్ లోక్ సభ నుంచి ఎంపీగా […]
ఇంగువ దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. వంటల్లో సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తుంటారు. ఇంగువ సువాసన కోసం మాత్రమే కాదు బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇంగువ ఔషధ గుణాలు కలిగి ఉండడంతో పలు రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు తీసుకుంటుంటారు. ఇంట్లో పప్పు లేదా సాంబార్, పులిహోర వండేటప్పుడు తాళింపులో వేసే కచ్చితమైన పదార్థం ఇంగువ. ఇంగువ జోడిస్తే ఈ పదార్థాలకు స్పెషల్ అరోమా వస్తుంది. ఇంగువ కేవలం స్మెల్, టేస్ట్ మాత్రమే తీసుకు […]
కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నెల 27న పోలింగ్ జరుగనున్నది. కాగా పట్టభద్రుల స్థానం నుంచి బీజేపీ ఎమ్ఎల్సీ అభ్యర్థిగా డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి పోటీచేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. 13 జిల్లాల్లో 271 పట్టణాలు, 499 పోలింగ్ బూత్ లున్నాయని తెలిపారు. ఏ […]
లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అని తెలిసినప్పటికీ లంచావతారులు మారడం లేదు. లంచ రహిత సమాజం కోసం పాటుపడాల్సిన అధికారులు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఏసీబీ అధికారులు లంచగొండుల భరతం పడుతున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా ఓ డీపీవో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళ్తే.. పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ నుంచి లంచం వసూలు చేసేందుకు రెడీ అయ్యారు డీపీవో శ్యామ్ సుందర్. వెంచర్ […]
నాగర్ కర్నూల్ లో తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం వెలుగుచూసింది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేలా చేసింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చేసిన తప్పు వల్ల విద్యార్థులకు మెమోలలో ఫోటోలు తప్పుగా వచ్చాయి. దీంతో కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2024 లో ఇంటర్మీడియట్ పాస్ అయిన 60 మందికి పైగా విద్యార్థులకు ఇంటర్మీడియట్ మెమోలలో ఫోటోలు తప్పుగా వచ్చాయి. ఈ విద్యార్థులంతా ప్రభుత్వ బిసి వెల్ఫేర్ […]
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాంధీ భవన్ లో కుల గణన పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ఫలాలు జనాభా దామాషా ప్రకారం పంచాలని రాహుల్ గాంధీ ఆలోచన అని అన్నారు. ప్రణాళిక బద్దంగా సమగ్ర కుల సర్వే సంపూర్ణంగా జరిగింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది. ప్రభుత్వం అంటే పన్నులు వసూలు చేసి.. పాలించడం కాదు. దేశంలో వచ్చిన విప్లవాత్మకమైన […]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఆయా పార్టీల కుట్రలను తిప్పికొట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. లోక్ సభ ఎంపీ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాడని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తెలంగాణలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే యువజన కాంగ్రెస్ నేతలు కీలకం అని […]
తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మె్ల్సీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. కాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టం నిన్నటితో ముగిసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరుగనన్నది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజీపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ […]