నకిలీ VPN యాప్‌లు, ఎక్స్టెన్షన్లు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొంటూ Google ఇటీవల ఒక కొత్త హెచ్చరికను జారీ చేసింది. ఈ యాప్‌లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందాయి. ఉచిత VPNల వినియోగదారులు ప్రమాదంలో ఉన్నారు. అనేక ఉచిత VPN యాప్‌లు వినియోగదారు డేటాను లాగ్ చేస్తాయి, ట్రాకర్లను ఇన్స్టాల్ చేస్తాయి. నకిలీ సమీక్షలతో వారి ర్యాంకింగ్‌లను పెంచుతాయి అని Google చెబుతోంది. ఇప్పుడు, స్కామ్ గ్రూపులు మాల్వేర్ను వ్యాప్తి చేయడానికి ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నాయి. Also […]
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) రూల్స్ 2025ను విడుదల చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ కొత్త నియమాలు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023ను అమలు చేయడానికి ఉద్దేశించబడ్డాయి. కొత్త నిబంధనల ప్రకారం, సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, వినియోగదారుల వ్యక్తిగత డేటాను నిల్వ చేసే అన్ని కంపెనీలు తాము ఏ డేటాను నిల్వ చేస్తున్నారో, దానిని ఎలా ఉపయోగిస్తారో వెల్లడించాల్సి ఉంటుంది. […]
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బ్లాస్ట్ భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా కేంద్ర ప్రకటించింది. తాజాగా ఢిల్లీ ఉగ్రవాద పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ నలుగురు వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఢిల్లీ టెర్రర్ బ్లాస్ట్ కేసు దర్యాప్తు నేపథ్యంలో జమ్మూ & కాశ్మీర్ పోలీసుల నుండి వచ్చిన సమాచారం, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం, నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) కీలక […]
KTM తన 2024 మోడల్ ఇయర్ 125, 250, 390, 990 డ్యూక్ బైక్స్ కు స్వచ్ఛంద రీకాల్ జారీ చేసింది. కొన్ని బైక్‌లలో ఫ్యుయల్ ట్యాంక్ క్యాప్ సీల్లో పగుళ్లు ఏర్పడవచ్చని కంపెనీ గుర్తించింది. దీనివల్ల ఫ్యుయల్ లీక్‌ల ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల, KTM ఈ బైక్లన్నింటిపై ఇంధన ట్యాంక్ క్యాప్ సీల్‌ను ఉచితంగా భర్తీ చేస్తుంది. ఈ పని అధీకృత KTM డీలర్‌షిప్‌లలో మాత్రమే నిర్వహిస్తారు. కస్టమర్లు తమ బైక్ రీకాల్ జాబితాలో ఉందో […]
ప్రముఖ బైక్ ట్యాక్సీ యాప్ ఉబర్ తన డ్రైవర్లకు గుడ్ న్యూస్ అందించింది. భారత్ లోని తన డ్రైవర్ల కోసం ఉబర్ యాప్‌లో వీడియో రికార్డింగ్ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది. ఈ ఫీచర్ ఉద్దేశ్యం ఏమిటంటే, డ్రైవర్లు ప్రయాణీకులు చేసే తప్పుడు ఫిర్యాదులు లేదా అనుచిత ప్రవర్తన నుండి తమను తాము రక్షించుకోవడంలో సహాయపడుతుంది. డ్రైవర్లు ఇప్పుడు ఉబర్ యాప్‌లో వీడియోలను రికార్డ్ చేయడానికి వీలుంటుంది. వివాదం తలెత్తినప్పుడు ఆధారాలను అందించొచ్చు. ప్రముఖ రైడ్-హెయిలింగ్ సర్వీస్ (ప్రయాణీకులను […]
ప్రస్తుత రోజుల్లో బైక్ నిత్యావసరం అయిపోయింది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనులు చేసుకునే వారు బైక్ లనే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు నెలకు రూ. 20,000 సంపాదిస్తూ, తక్కువ ధరకు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ. 70-80 వేల వరకు ఉంటే, హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీల నుంచి వచ్చిన 9 బైక్‌లు బడ్జెట్ ధరలో క్రేజీ మైలేజ్ తో అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫైనాన్సింగ్ లభ్యతతో, […]
రైతులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏడాదికి మూడు విడతల్లో రూ. 6 వేల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ఇప్పటి వరకు 20 విడతలు పూర్తవగా 21 వ విడత నిధుల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగ కేంద్రం రైతులకు శుభవార్తను అందించింది. పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది. నవంబర్ 19న […]
నిత్యావసర వస్తువైన వంట నూనె వినియోగం పెరుగుతోంది. డిమాండ్ కు తగిన ఉత్పత్తి లేకపోవడంతో భారత్ వంట నూనెను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి, భారత్ 2024-25 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్ వరకు) 16 మిలియన్ టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకుంది. మొత్తం ఖర్చు రూ. 1.61 లక్షల కోట్లు అని పరిశ్రమ సంస్థ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) గురువారం విడుదల చేసిన డేటా వెల్లడించింది. Also […]
సరికొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కొత్త మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. హువావే ప్రస్తుతం 20GB RAMతో రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ప్రస్తుతం రాబోయే హువావే మేట్ 80 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తోంది. ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే, కంపెనీలు ప్రస్తుతం 12GB నుంచి 16GB RAMని అందిస్తున్నాయి. గేమింగ్ స్మార్ట్ఫోన్లు కూడా ఇంత RAMని అందిస్తున్నాయి. ఇప్పుడు, […]
డిజిలాకర్ అనేది ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఇది యూజర్లు అఫీషియల్ డాక్యుమెంట్స్ ను ఆన్లైన్లో స్టోర్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. డిజిటల్ ఇండియా చొరవ కింద ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ (MeitY) రూపొందించిన ఈ సర్వీస్, అన్ని డాక్యెమెంట్ల భౌతిక కాపీలను తీసుకెళ్లడంలో ఇబ్బందిని తొలగిస్తుంది. ఇది గుర్తింపు ధృవీకరణ కోసం మీ ఆధార్ నంబర్‌ను ఉపయోగిస్తుంది. ప్రభుత్వం జారీ చేసిన పత్రాల డిజిటల్ వెర్షన్లను సురక్షితంగా నిల్వ చేయడానికి, యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని […]