విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లి పట్ల కర్కశంగా వ్యవహరించింది ఓ కూతురు. తన ప్రేమ వివాహానికి అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి హత్య చేయించందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శృంగవరపుకోట మండలం వెంకటరమణపేటలో మహిళ కిడ్నాప్ అనంతరం మర్డర్ కు గురైంది. బహిర్భూమికి వెళ్లిన తల్లి కూతుర్లలో తల్లిని ఆటోలో వచ్చిన కూతురు ప్రియుడు ఎత్తుకెళ్లాడు. పోలీస్ స్టేషన్ లో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. Also Read:Top Hedlines @1PM […]
హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేశారు కొందరు వ్యక్తులు. పసిగట్టిన ఆంధ్ర, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఐసీస్ మోడల్ ఆపరేషన్ ని భగ్నం చేశారు. విజయనగరంకు చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ ను అరెస్టు చేశారు. సిరాజ్ విజయనగరం లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. శిరాజ్, సమీర్ కలిసి నగరంలో డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. సౌదీ అరేబియా నుంచి […]
హైదరాబాద్ లో రోజుల వ్యవధిలోనే ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల పాత బస్తీలోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా అందులోని నివాసితులు ప్రాణాలతో బయటపడ్డారు. నేడు మీర్ చౌక్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అగ్నిప్రమాదంలో పలువురు దుర్మరణం పాలవడం నన్ను […]
భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన వార్తలపై భారత సైన్యం సంచలన ప్రకటన చేసింది. ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయి చర్చలు జరగవని భారత సైన్యం స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఈరోజు ముగియబోతోందని కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయని ఆర్మీ తెలిపింది. దీంతో దేశ వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఊహాగానాలపై భారత సైన్యం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. Also Read:UP: పెళ్లైన […]
ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలోని అమౌలి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 44 ఏళ్ల వ్యక్తి రాజు పాల్ వివాహం అయిన ఆరు రోజుల తర్వాత తన భార్యను కొట్టి చంపాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై భారత శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. […]
అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఒక సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొంది. ఈ పేలుడులో ఒకరు మరణించగా, దాదాపు నలుగురు గాయపడ్డారు. ఇది ఉద్దేశపూర్వక ఉగ్రవాద చర్య అని FBI చెబుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని FBI లాస్ ఏంజిల్స్ ఫీల్డ్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ అకిల్ డేవిస్ తెలిపారు. Also Read:Tirupati Laddu Case: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి […]
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టీటీడీ ఉద్యోగుల అవినీతిపై దృష్టి సారించింది సిట్. ఈ క్రమంలో తిరుమల లడ్డు నెయ్యి కేసులో డొంక కదులుతోంది. సిట్ ఇప్పటికీ చార్జ్ షీట్ వేసింది. భోలేబాబా డెయిరీ కేంద్రంగా దర్యాప్తు చేస్తోంది.. తాజాగా టీటీడీలో జరిగిన అంశాలపై దర్యాప్తు ప్రారంభమైంది. Also Read:Telegram Global Contest: కంటెంట్ క్రియేటర్ల […]
అన్నమయ్య జిల్లాలోని పీలేరు సదుం రోడ్డులో ఘోర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ఘటనలో కర్ణాటక కు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఈ విషాదకర ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లి పడడంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. స్థానికులు కారును బావిలోంచి బయటకు తీశారు. మృతులు ఎవరన్నది తెలియ […]
చెన్నై సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం సృష్టించాయి. సేలం సెంట్రల్ జైలులో ఉన్న స్నేహితుడైన ఓ ఖైదీకి గంజాయి ఇవ్వడానికి వెళ్లాడు ఓ యువకుడు. బిస్కెట్ల ఫ్యాకేట్ ఓపెన్ చేసి ఉండటంతో అనుమానం వచ్చి తనిఖీ చేశారు జైలు సిబ్బంది. బిస్కె్ట్లలో గంజాయి తరలించడాన్ని చూసి షాక్ కు గురయ్యారు. బిస్కెట్లకు రంధ్రం చేసి వాటిలో గంజాయి పెట్టి తీసుకొచ్చాడు ఆ యువకుడు. బిస్కెట్ ప్యాకెట్లో దాచిన 80 గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. […]
అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ లోయలో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం భూకంపం గురించి నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ సమాచారం ఇచ్చింది. జాతీయ భూకంప కేంద్రం ప్రకారం, ఉదయం 5:06 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా అరుణాచల్ ప్రదేశ్లో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించ లేదు. భూకంపం కారణంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రత తక్కువగా ఉండడంతో పెనుప్రమాదం తప్పనట్లైంది. Also Read:Nara […]