పాకిస్తాన్‌లోని సహజ వనరులపై జరుగుతున్న వాదనలను బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాంతంలో ఉన్న విస్తారమైన చమురు, ఖనిజ నిల్వలు వాస్తవానికి పాకిస్తాన్‌కు కాదని, ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’కు చెందినవని ఆయన తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రభుత్వాన్ని పాకిస్తాన్ సైన్యం, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ‘పూర్తిగా తప్పుదారి పట్టించారని’ మీర్ యార్ బలూచ్ వెల్లడించాడు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే దేశంగా ఆయన అభివర్ణించారు.
Also Read:TTD : దేవదేవుని దివ్య ప్రసాదం ‘తిరుమల శ్రీవారి లడ్డూ’కు జన్మదిన శుభాకాంక్షలు
గత గురువారం X లో తన ప్రకటనలో, మీర్ యార్ బలోచ్ ఈ ప్రాంతంలోని చమురు, ఖనిజ వనరుల గురించి ట్రంప్ చేసిన వాదనను బిగ్ మిస్టేక్ అని అభివర్ణించారు. ఈ వనరులు పంజాబ్‌లో లేవని, బలూచిస్తాన్‌లో ఉన్నాయని, వాటికి పాకిస్తాన్‌తో ఎటువంటి సంబంధం లేదని బలోచ్ స్పష్టం చేశాడు. మీర్ యార్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతంలో అపారమైన చమురు, ఖనిజ నిల్వలు ఉన్నాయని మీరు నమ్మడం నిజమే, కానీ పాకిస్తాన్ సైన్యం, ముఖ్యంగా జనరల్ అసిమ్ మునీర్, అతని దౌత్య యంత్రాంగం మిమ్మల్ని తీవ్రంగా తప్పుదారి పట్టించిందని మీకు చెప్పడం ముఖ్యం.
Also Read:Meat: ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. గొర్రె మాంసం కొంటలేరని.. మేక తోక అంటించి..
చమురు, సహజ వాయువు, రాగి, లిథియం, యురేనియం, అరుదైన భూమి ఖనిజాలు వంటి ఖనిజ నిల్వలు పంజాబ్‌లో కాకుండా బలూచిస్తాన్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతం పాకిస్తాన్‌కు చెందినది కాదు, కానీ 1948లో పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన బలూచిస్తాన్ రిపబ్లిక్ కు చెందినది.’ అని తెలిపాడు. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా, పాకిస్తాన్ సంయుక్తంగా పాకిస్తాన్‌లో ‘భారీ చమురు నిల్వలను’ అభివృద్ధి చేయడానికి ఒక ఒప్పందానికి వచ్చాయని. ‘బహుశా ఒక రోజు పాకిస్తాన్ భారతదేశానికి చమురు అమ్ముతుంది’ అని వెల్లడించాడు.
Also Read:Astrology: ఆగస్టు 3, ఆదివారం దినఫలాలు
పాకిస్తాన్ సైన్యం, దాని నిఘా సంస్థ ISI, “ఉగ్రవాద సంస్థల పోషకులు”గా అభివర్ణించారు. బలూచిస్తాన్ ఖనిజ సంపదను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగిస్తాయని, ఇది ప్రపంచ భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుందని మీర్ యార్ బలోచ్ ట్రంప్‌ను హెచ్చరించారు.’బలూచిస్తాన్‌లో ట్రిలియన్ల డాలర్ల విలువైన వనరులను పాకిస్తాన్ సైన్యానికి, దాని ఏజెన్సీ ఐఎస్‌ఐకి అందించడం వ్యూహాత్మక తప్పిదమవుతుంది. ఇది ఐఎస్‌ఐ ఆర్థిక, కార్యాచరణ సామర్థ్యాలను పెంచుతుంది.
Also Read:AsiaCup2025: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగేది అక్కడే.. ఆసియా కప్ వేదికలివే
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నెట్‌వర్క్‌లను వ్యాప్తికి దారితీస్తుందన్నాడు. ఇది 9/11 వంటి దాడులు పునరావృతమయ్యే అవకాశాన్ని కూడా పెంచుతుంది అని ఆయన అన్నారు. పాక్ ఈ వనరులను బలూచ్ ప్రజల కోసం ఉపయోగించదని.. భారత్, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా జిహాదిస్ట్ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తుందని, ఇది దక్షిణాసియా, మొత్తం ప్రపంచంలో అస్థిరతను పెంచుతుందని ఆయన అన్నారు. బలూచ్ ప్రజలు తమ వనరులపై స్వేచ్ఛ, హక్కుల కోసం చేస్తున్న చట్టబద్ధమైన డిమాండ్‌ను అంగీకరించాలని అంతర్జాతీయ సమాజానికి, ముఖ్యంగా అమెరికాకు మీర్ యార్ బలూచ్ విజ్ఞప్తి చేశారు.