సుప్రీం కోర్టు కొలీజియం హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీకి సిఫారసు చేసింది. మే 26న జరిగిన సమావేశంలో కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జీల బదిలీలకు సిఫారసు చేసింది. న్యాయమూర్తి సుజోయ్ పాల్ తెలంగాణ నుంచి కలకత్తా కు బదిలీ, న్యాయమూర్తి వి. కామేశ్వర్ రావు కర్ణాటక నుంచి ఢిల్లీ కి, న్యాయమూర్తి లనుసుంకుమ్ జామిర్ గౌహతి నుంచి కలకత్తా కు, న్యాయమూర్తి మనాష్ రంజన్ పాఠక్ గౌహతి నుంచి ఒరిస్సా […]
రియల్ మీ బడ్స్ ఎయిర్ ప్రో ఇయర్ బడ్స్ భారత మార్కెట్ లో రిలీజ్ అయ్యాయి. ఈ కేస్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 48 గంటల ప్లేబ్యాక్ సమయం లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఇయర్ఫోన్లు 53dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), 45ms తక్కువ లేటెన్సీ మోడ్‌కు మద్దతు ఇస్తాయి. బడ్స్ ఎయిర్ 7 ప్రోలో AI లైవ్ ట్రాన్స్‌లేటర్, ఫేస్ టు ఫేస్ ట్రాన్స్‌లేటర్, AI ఎంక్వైరీ వంటి AI ఫీచర్లు ఉన్నాయి. రియల్మే […]
పెద్దల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు లిఫ్టుల్లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ అదే ఏమరపాటుగా ఉంటున్నారు. పిల్లలు తెలిసి తెలియక లిఫ్ట్ ఎక్కి ఆ తర్వాత కదులుతున్న సమయంలో డోర్స్ ఓపెన్ చేస్తూ తుంటరి పనులు చేస్తుండడంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. కౌశాంబి ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో మైనర్ బాలుడు లిఫ్ట్ తలుపు తెరిచి దానిలో చిక్కుకున్నాడు. చాలాసేపటి తర్వాత బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. […]
వర్షాలు కురిసినప్పుడు వాహనాలు వరదల్లో చిక్కుకోవడం, బురదలో కూరుకుపోవడం చూస్తుంటాం. భారీ క్రేన్లు, బుల్డోజర్లు, జేసీబీల సాయంతో వాహనాలను బయటకు లాగుతుంటారు. అయితే తాజాగా ఓ ఏనుగు నదిలో చిక్కుకున్న టయోటా ఫార్చ్యూనర్ కారును నిమిషాల్లోనే బయటకు లాగేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. కొంతమంది దీనిపై నిజమైన ఏనుగు నకిలీ ఏనుగును లాగుతోందని కామెంట్ చేస్తున్నారు. ఏనుగు శక్తి ముందు 166 హార్స్పవర్ విఫలమైందని నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. […]
ఆధార్ అప్ డేట్ చేసుకోని వారికి బిగ్ అలర్ట్. త్వరలోనే ఉచిత గడువు ముగియనున్నది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI పౌరులు తమ ఆధార్ వివరాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. అయితే ఈ సౌకర్యం జూన్ 14, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గడువు లోగా అప్ డేట్ చేసుకుంటే రూ. 50 సాధారణ ఫీజు ఉండదు. ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేయడానికి కొన్ని రోజులు మాత్రమే […]
ఆర్థిక రాజధాని ముంబైలోని ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌ను పేల్చివేస్తామంటూ అగంతకులు ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ముంబై విమానాశ్రయాన్ని పేల్చివేస్తాము అని హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మూడు గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌ను తనిఖీ చేశారు. బాంబు గుర్తింపు బృందాలు, ఇతర భద్రతా సంస్థలు విమానాశ్రయంలో హై అలర్ట్‌లో ఉన్నాయి. MIDC పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి వేగంగా […]
అవకాశం వచ్చినప్పుడే ఒడిసిపట్టుకోవాలి. మళ్లీ మళ్లీ అదృష్టం తలుపు తట్టదు కదా. మీ లైఫ్ సెట్ చేసుకోవడానికి కూడా ఇదే గోల్డెన్ ఛాన్స్. మంచి జాబ్ సాధించి లైఫ్ లో స్థిరపడాలనుకుంటే ఈ బ్యాంక్ జాబ్స్ ను అస్సలు వదలకండి. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ […]
ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఆయన రూ.77 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఐదు నగరాల్లో నాలుగు రోడ్ షోలు, మూడు బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగించనున్నారు. దీనితో పాటు, ‘మేక్ ఇన్ ఇండియా’ కింద, దాహోద్‌లో రూ. 21 వేల కోట్లకు పైగా వ్యయంతో ఏర్పాటు చేసిన రైల్వే ఉత్పత్తి యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. Also Read:HPSL […]
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెన్నైలోని తిరువాన్మియూర్‌లో జరిగిన ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అనే సెమినార్‌కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సెమినార్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తిరువల్లువర్, భారతియార్, ఎంజీఆర్ జీవించిన నేల తమిళనాడు.. తమిళనాడు సిద్ధుల భూమి. తమిళ దేవుడు మురుగన్ భూమి.. నేను తమిళనాడులో నివసించాను.. నేను చెన్నైలో పెరిగాను.. నేను తమిళనాడు వదిలి వెళ్ళిపోయినా, తమిళనాడు నన్ను వదిలి వెళ్ళలేదు అని అన్నారు. Also Read:Kakani […]
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా యాక్టివ్ కేసులు 1000 దాటాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసి గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య శాఖ ప్రకారం, కేరళలో అత్యధికంగా 430 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 209, ఢిల్లీ 104 యాక్టివ్ కేసులతో మూడవ స్థానంలో ఉన్నాయి. కర్ణాటకలో కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య […]