హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తన తల్లి జన్మదిన వేడుకలను జరుపుకునేందుకు వెళ్లి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికోండ ప్రాంతానికి చేందిన జయంత్ గౌడ్ (21) తన తల్లి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ను స్నేహితులతో కలిసి జరుపుకోవాలని భావించాడు. ఫ్రెండ్స్ తో కలిసి మాదాపూర్ లోని యశోద హాస్పిటల్ వెనుక ఉన్న ప్రాంతంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. జయంత్ గౌడ్ స్నేహితులతో మద్యం సేవిస్తూ […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం విదేశీ ఉక్కు దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేసే ప్రణాళికను ప్రకటించారు. ప్రస్తుత 25 శాతం నుంచి సుంకం రేటును 50 శాతానికి పెంచారు. అమెరికన్ ఉక్కు పరిశ్రమను ప్రోత్సహించడమే ఈ సుంకం లక్ష్యం అని ఆయన అన్నారు. పెన్సిల్వేనియాలోని యుఎస్ స్టీల్, మోన్ వ్యాలీ వర్క్స్-ఇర్విన్ ప్లాంట్‌లో మాట్లాడుతూ, సుంకాల పెంపు దేశీయ ఉక్కు ఉత్పత్తిదారులను రక్షించి, అమెరికన్ తయారీని పెంచుతుందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. Also Read:Operation Shield: […]
ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం టర్కీకి షాకుల మీద షాకులిస్తోంది. కేంద్రం ఇండిగోను టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో తన విమానాల లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా ముగించాలని ఆదేశించింది. ఢిల్లీతో సహా భారత్ లోని తొమ్మిది కీలక విమానాశ్రయాలలో సేవలను నిర్వహించిన టర్కీ-సంబంధిత సంస్థ సెలెబి ఏవియేషన్‌కు భద్రతా అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని వారాల తర్వాత టర్కీకి మరో దెబ్బ తగిలేలా చేసింది భారత్. Also […]
మే 31న అంటే శనివారం పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు అధికారులు. భారత్ లో జరగనున్న ఈ మాక్ డ్రిల్ ముందు పాకిస్తాన్లో భయానక వాతావరణం నెలకొంది. పాకిస్తాన్‌లోని అన్ని మీడియా ఛానెళ్లలో, ఈ మాక్ డ్రిల్‌ను భారత్ కొత్త చర్యతో ముడిపెడుతున్నారు. పాకిస్తాన్ సైన్యంలోని ప్రముఖ జర్నలిస్టులు, మాజీ అధికారులు అణు దాడి భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. Also Read:GT vs MI IPL 2025 Eliminator: క్వాలిఫయర్-2కి ముంబై.. ఇంటికి గుజరాత్.. […]
ప్రజలకు సేవా చేయాల్సిన ప్రభుత్వాధికారులు లంచాలకు పడగలెత్తుతున్నారు. కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. అవినీతి అధికారులపై ఏసీబీ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో లంచం పుచ్చుకుంటూ పట్టుబడుతున్నారు. తాజాగా మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. కాగా ఏసీబీ అధికారులు సోదాలకు వచ్చారన్న విషయం తెలిసి కిటికీలోంచి ఏకంగా రూ. 2 కోట్లను బయటపడేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. Also […]
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. షాద్ నగర్ లో మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న TG 38 6669 నెంబర్ గల ఇన్నోవా కారును పక్కన నుంచి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసం అయ్యింది. ఈ […]
యూట్యూబ్ భయ్యా సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే సన్నీ యాదవ్ బైక్‌పై పాకిస్థాన్ వెళ్లి వచ్చాడు. దీంతో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. భయ్యా సన్నీ యాదవ్ ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సన్నీ యాదవ్ స్నేహితుడు చెర్రీని ఇంట్లో 29న గుర్తుతెలియని వ్యక్తులు అదుపులోకి […]
ఐపీఎల్ టైటిల్ కు అడుగు దూరంలో ఉంది ఆర్సీబీ. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సారి కప్పు మాదే అంటూ సంబరపడిపోతున్నారు. అయితే నిన్న మ్యాచ్ సందర్భంగా ఓ మహిళ చేతిలో […]
ఎంత చనువుగా మెదిలినా పులి పిల్లి అవ్వదుగా. చనువిచ్చింది కదా అని అతి చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఫారిన్ లో కొన్ని జూపార్క్ లలో పులులతో ఫొటోలు తీసుకుంటుంటారు. సరదాగా వాటి పక్కన నడుస్తుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పైత్యం మరింత ముదిరింది. రీల్స్ కోసం ఏకగాం పెద్ద పులితోనే పరాచికాలు ఆడుతున్నారు. ఇలాగే ఓ యువకుడు పెద్దపులితో రీల్స్ చేస్తూ దాడికి గురయ్యాడు. ఈ ఘటన థాయిలాండ్ లో చోటుచేసుకుంది. […]
పంజాబ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. 27 మంది గాయపడ్డారు. లంబి నియోజకవర్గానికి సమీపంలోని సింఘేవాలా-ఫుతుహివాలా గ్రామంలోని పొలాల్లో ఉన్న బాణసంచా కర్మాగారంలో నిన్న అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. గాయపడిన వారిని బతిండా ఎయిమ్స్‌కు తరలించారు. ఈ పేలుడులో, ఫ్యాక్టరీ భవనంలోని రెండు అంతస్తులు క్షణాల్లో పేక ముక్కలా కుప్పకూలాయి. కర్మాగారంలో బాణసంచా తయారీ పని ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ నివాసి అయిన కాంట్రాక్టర్ […]