టెక్నాలజీ అద్భుతమైన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఏఐతో వినూత్న ఆవిష్కరణలు ఉద్భవిస్తున్నాయి. తాజాగా ప్రపంచంలోనే తొలిసారిగా రెండు రోబోల మధ్య బాక్సింగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో రోబోలు ఒకరినొకరు తన్నుకుంటూ, గుద్దుకుంటూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు పంచ్‌ల వర్షం కురిపించుకున్నారు. అచ్చం మానవ బాక్సింగ్ పోటీల మాదిరిగానే జరిగాయి. ఈ 4.25 అడుగుల పొడవైన రోబోల పోటీని టీవీలో కూడా ప్రసారం చేశారు. Also Read:U16 Davis Cup: ఓడినా సిగ్గు లేదుగా.. ఓవర్ యాక్షన్ చేసిన […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను తాను ప్రతిపాదించిన $175 బిలియన్ల ‘గోల్డెన్ డోమ్’ క్షిపణి రక్షణ వ్యవస్థలో ఉచితంగా చేరాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ షరతు విధించారు. “వారు ఒక ప్రత్యేక దేశంగా ఉంటే వారికి $61 బిలియన్లు ఖర్చవుతుందని నేను కెనడాకు చెప్పాను, కానీ వారు అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరితే వారికి సున్నా డాలర్లు ఖర్చవుతాయి” అని ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చారు. […]
విదేశీ విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. సోషల్ మీడియా ఖాతాలపై లోతైన దర్యాప్తును తప్పనిసరి చేసే ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకుంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంతకం చేసిన పత్రాలను ఉటంకిస్తూ పొలిటికో ఈ సమాచారాన్ని అందించింది. ఈ చర్య విద్యార్థుల వీసా ప్రక్రియపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని, ఆర్థికంగా నిలకడగా ఉండటానికి విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ఎక్కువగా ఆధారపడే అనేక US విశ్వవిద్యాలయాలను దెబ్బతీస్తుందని నివేదిక పేర్కొంది. జాతీయ […]
తమిళనాడులోని చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న విజీపీ అమ్యూజ్మెంట్ పార్క్ లో రోలర్ కోస్టర్ నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో భయానక వాతావరణం నెలకొంది. ఎనిమిది మంది పిల్లలు, పది మంది మహిళలు సహా ముప్పై మంది దాదాపు మూడు గంటల పాటు 70 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. మూడు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు పర్యాటకులు. పైకి వెళ్ళిన రోలర్ తిరిగి కిందకు వచ్చే సమయంలో సాంకేతికత లోపం కారణంగా ఆగిపోయింది. […]
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య, బహిష్కృత పాకిస్తాన్ నాయకుడు, ముత్తహిదా క్వామీ ఉద్యమం (MQM) వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి సహాయం కోరాడు. ఉర్దూ మాట్లాడే శరణార్థులు, అంటే దేశ విభజన తర్వాత భారత్ నుంచి వచ్చి పాకిస్తాన్లో స్థిరపడిన ముహాజీర్లను హింసించే అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలని అల్తాఫ్ హుస్సేన్ ప్రధాని మోడీని అభ్యర్థించారు. లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ […]
బుధవారం ఉదయం స్పేస్ఎక్స్ తన స్టార్‌షిప్ సూపర్ హెవీ రాకెట్ తొమ్మిదవ టెస్ట్ ఫ్లైట్‌ను ప్రారంభించింది. దక్షిణ టెక్సాస్‌లోని బోకా చికా బీచ్ సమీపంలోని కంపెనీ స్టార్‌బేస్ లాంచ్ సైట్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ మిషన్ భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది. ప్రపంచం దృష్టంతా ఈ ప్రయోగంపైనే కేంద్రీకృతమైంది. అయితే రాకెట్ విజయవంతంగా ప్రయోగించారు. కానీ ప్రయోగించిన కొంత సమయం తర్వాత స్టార్‌షిప్ నియంత్రణను కోల్పోయింది. దీని కారణంగా, అది […]
ఐపీఎల్ సీజన్ లో పేలవమైన ప్రదర్శనతో సతమతమవుతున్న రిషబ్ పంత్.. ఈ సీజన్లో తన చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు. సీజన్ అంతా పంత్ ఫామ్‌లో లేడు, కానీ మంగళవారం జరిగిన చివరి మ్యాచ్‌లో తన నిజమైన ఫామ్‌ను చూపించాడు. గత మ్యాచ్ లలో ఇదే ఊపుతో ఆడి ఉంటే లక్నో పరిస్థితి వేరేలా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. Also Read:TDP Mahanadu: అట్టహాసంగా మహానాడు.. ఆరు ప్రధాన అంశాలు […]
మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను అభినందిస్తున్నానన్నారు. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారింది.. ధాన్యం కొనుగోలు […]
ఎలక్ట్రిక్ ఆటోలకు ఆదరణ పెరుగుతోంది. బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో వాహనదారులు వీటి కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. తాజాగా మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ ఆటో రిలీజ్ అయ్యింది. టెర్రా మోటార్స్ తన ఎలక్ట్రిక్ ఆటోను భారత మార్కెట్లో క్యోరో ఎలక్ట్రిక్ ఆటోను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఆటో అద్భుతమైన పనితీరును అందించడమే కాకుండా, ఒకే ఛార్జ్‌పై ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను కూడా అందిస్తుంది. దీనిని యాంటీ-రస్ట్ పూతతో రూపొందించారు. ఏ సీజన్లో అయినా తుప్పు పట్టకుండా […]