గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పట్ల మెతక వైఖరి ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసిన తర్వాత కఠిన వైఖరి తీసుకున్నారు. న్యూజెర్సీలోని మోరిస్టౌన్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్ రష్యా అధ్యక్షుడిపై తీవ్ర విమర్శలు చేస్తూ, “నేను పుతిన్ వ్యవహారం సరిగా లేదు. ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడు. ఈ వ్యక్తికి ఏమైందో నాకు తెలియదు” అని అన్నారు. Also Read:AP News : ఇద్దరు […]
సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించింది. దీనిని మొదటగా 2025 ఆటో ఎక్స్‌పోలో ఇ-యాక్సెస్ పేరుతో ప్రదర్శించారు. ఈ-యాక్సెస్‌ను మొదట 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ స్కూటర్లో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ అమర్చారు. దీని బ్యాటరీ నీటిలో ముంచడం, విపరీతమైన వేడి లేదా చలి, షాక్, పడిపోవడం, ఒత్తిడి, పంక్చర్ వంటి అనేక పరీక్షలను ఎదుర్కొన్నది. ఇది SDMS-e ని కలిగి ఉంది. దీనిలో […]
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్ తర్వాత, భారత టెస్ట్ క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ పర్యటనతో ఇది ప్రారంభమవుతుంది. శనివారం టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. శుభ్‌మాన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. భారత జట్టు యువ జట్టుతో నాల్గవ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, యువ శుబ్మాన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. […]
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని సూచించారు. ఏ హోదాలో ఉన్నా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదని కేటీఆర్ అన్నారు. ఇది అందరికీ వర్తిస్తుందని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. ఎవరైనా సూచనలు చేయొచ్చు.. లేఖ రాయొచ్చని తెలిపారు. అన్ని పార్టీల్లోను కోవర్టులుంటారు. మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులుంటే ఉండొచ్చని కేటీఆర్ వెల్లడించారు. Also Read:Rahul Gandhi: కాశ్మీర్లో యుద్ధ […]
భారతదేశంలో విశ్వసనీయ ఫర్టిలిటి కేర్ చెయిన్ గా పేరు పొందిన ఒయాసిస్ ఫెర్టిలిటీ మే నెలను మదర్స్ మంత్ గా వేడుక చేసుకుంటోంది. అందులో భాగంగా మదర్స్ డేని పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 30 రోజుల పాటు 30 పట్టణాల్లో ‘ఒయాసిస్ జనని యాత్ర’ పేరిట ఉచిత మొబైల్ ఫర్టిలిటి క్యాంప్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ కుమారి, మరియు ఒయాసిస్ ఫెర్టిలిటీ రీజినల్ మెడికల్ హెడ్ మరియు […]
కాసేపటి క్రితం కేటీఆర్ కాంగ్రెస్ పై, సీఎం రేవంత్ పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. సచివాలయంలో పంచాయతీ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ కు చిన్న మెదడు చితికిపోయింది అని మండిపడ్డారు. కాళేశ్వరంలో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం.. కమీషన్ ముందుకు రావడానికి ఎందుకు అని ప్రశ్నించారు. గ్లోబెల్స్ ప్రచారంలో నిన్ను […]
తెలంగాణ పాలిసెట్ పలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీ దేవ సేనా ఫలితాలను రిలీజ్ చేశారు. పాలిసెట్ ఉత్తీర్ణత 84.33 శాతంగా నమోదైంది. పాలిసెట్ లోనూ బాలికలదే హవా కొనసాగింది. గోరుగంటి శ్రీజ, తుమాటి లాస్య శ్రీ 120 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ప్రవేశ పరీక్షకు 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 98,858 అభర్థులు హాజరయ్యారు. వీరిలో 83,364 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. హాజరైన 53085 బాలురకు గాను 42836 మంది […]
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్ చేసిన పనులు ఏవైనా ఉన్నాయా అంటే అవి బీఆర్ఎస్ పై నిందలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు చేరవేయడమే తప్పా తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఫైర్ అయ్యారు. ఢిల్లీకి తెలంగాణ ఏటీఎం లాగ మారిపోయిందని […]
పాము.. ఆ పేరు వింటేనే ఒంట్లో వణుకు పడుతుంది. అలాంటిది తుప్పల్లో, పుట్టల్లో ఉండే పాములు ఇంట్లోకి వస్తే భయంతో పరుగులు తీయాల్సిందే. పాము కాటుతో ప్రాణాలకే ప్రమాదం. అప్పుడప్పుడు ఇళ్లలోకి చేరి హల్ చల్ చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో షూస్, హెల్మెట్స్, బైక్ లలో పాములు దూరిన ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. బైకులోకి పాము దూరింది. ఈ విషయాన్ని గమనించిన బైక్ ఓనర్ మెకానిక్ […]
బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. నేడు తులంపై రూ. 500 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,808, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,990 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ ప్రభావితం అవడం వంటి కారణాలు పుత్తడి ధరల్లో మార్పుకు కారణమవుతున్నాయి. Also Read:Acer Swift Neo: ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో.. […]