తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదలకు వరంగా మారింది. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరబోతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందరిమ్మ ఇళ్లు ఇప్పిస్తామని లంచం అడిగేవారిని తనకు పట్టిస్తే పార్టీ నుంచి […]
ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ నార్వే చెస్ 2025 ఆరో రౌండ్లో సూపర్ విక్టరీ సాధించాడు. తన కెరీర్లో తొలిసారిగా క్లాసికల్ టైమ్ కంట్రోల్లో మాజీ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్ను ఓడించాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ కార్ల్సెన్ టోర్నమెంట్ ప్రారంభ రౌండ్లో గుకేష్ కు గట్టిపోటీనిచ్చాడు. అయితే, గుకేష్ తిరిగి పుంజుకుని నార్వేజియన్ ఆటగాడిని ఎదురుదాడితో ఓడించి మూడు పాయింట్లు సాధించాడు. Also Read:CM Revanth Reddy: తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం […]
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన రిలేషన్షిప్ మేనేజర్ల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో పూర్తి సమయం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. మార్కెటింగ్ లేదా ఫైనాన్స్‌లో MBA ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అదనంగా, దరఖాస్తుదారులు MSME బ్యాంకింగ్‌లో రిలేషన్షిప్ మేనేజర్‌గా కనీసం మూడు […]
రైల్వే ట్రాక్ పట్టాలు దాటొద్దని, ఫ్లాట్ ఫాంలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని రైల్వే అధికారుల సూచిస్తున్నప్పటికీ కొందరు అవేమీ పట్టించుకోకుండా ప్రమాదాలబారిన పడుతున్నారు. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మామండూరు దగ్గర హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి మృతి చెందాడు. రైలు దిగి ఫ్లాట్ ఫార్మ్ కు వెళ్లే సమయంలో ఘటన చోటుచేసుకుంది. ఫ్లాట్ ఫార్మ్ పై నుంచి కాకుండా రైలు పైకి ఎక్కడంతో విద్యార్థి ప్రమాదానికి గురయ్యాడు. Also Read:Shamli Delhi […]
ఢిల్లీ నుంచి షామ్లీ మీదుగా సహారన్పూర్ వెళ్తున్న రైలుకు పెను ప్రమాదం తప్పింది. బల్వా-షామ్లి రైల్వే మార్గంలో ట్రాక్‌పై సిమెంట్, ఇనుప పైపులను ఉంచి రైలు ప్రమాదానికి కుట్రపన్నారు దుండగులు. లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఆర్పిఎఫ్, జిఆర్పి సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు చాలా సేపు అడవిలో నిలిచి ఉండటంతో ప్రయాణికులు […]
భారత క్రికెటర్ రింకూ సింగ్ బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పే టైమ్ దగ్గరపడుతోంది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్, క్రికెటర్ రింకు సింగ్ వివాహ తేదీ ఖరారైంది. నవంబర్ 18న ఇద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. జూన్ 8న నిశ్చితార్థం జరగనుంది. ఇద్దరి ఉంగరోత్సవ వేడుక లక్నోలోని ఒక హోటల్లో జరుగుతుంది. ఈ ఏడాది జనవరిలో, క్రికెటర్ రింకు సింగ్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీతో పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. రింకూకి కాబోయే […]
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. నేడు ప్రజలకు రేషన్ రైస్ పంపిణీ చేశారు. అయితే ఈ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. డోర్ డెలివరీ విధానాన్ని తొలగించడంపై మండిపడ్డారు. జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు మీకు ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష?.. మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు?.. ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి […]
పిఠాపురం 18 వ వార్డులో రేషన్ షాప్ ద్వారా రేషన్ బియ్యం సరఫరా కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో కోటి 46 లక్షల కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం అందిస్తామన్నారు. దురుద్దేశంతో రేషన్ షాప్ లను గత ప్రభుత్వం రద్దు చేసింది. 29796 రేషన్ షాప్ ల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది.. 9260 ఎండీయు వాహనాలు […]
కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు బిగ్ షాకిచ్చింది. ఆ స్మార్ట్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదని తెలిపింది. జూన్ 1 నుంచి కొన్ని ఐఫోన్లు, ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. భద్రతాపరమైన చర్యల్లో భాగంగా మెటా ఈ చర్య తీసుకుంది. iOS 15 లేదా అంతకంటే పాత వెర్షన్లతో పనిచేస్తున్న iPhone లకు WhatsApp ఇకపై సపోర్ట్ చేయదు. ఈ మెసేజింగ్ యాప్ ఆండ్రాయిడ్ 5.0 […]
‘ఆపరేషన్ సింధూర్’ విజయం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం తన వైఖరిని ప్రపంచానికి తెలియజేస్తోంది. ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలు వివిధ దేశాలకు వెళ్లి, ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తున్న తీరును బయటపెడుతున్నాయి. ఈ ఎపిసోడ్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. Also Read:Corona: దేశంలో 3000 దాటిన కరోనా కేసులు.. తమిళనాడులో యువకుడు మృతి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ ద్వంద్వ ప్రమాణాలను […]