విమాన ప్రమాదంలో ప్రముఖ మెక్సికన్ టీవీ హోస్ట్ డెబోరా ఎస్ట్రెల్లా(43) హఠాన్మరణం చెందింది. విమాన ట్రైనింగ్ పొందుతుండగా ఈ ఘోరం జరిగింది. తక్కువ ఎత్తులోనే విమానం ఎగురుతుండగానే కూలిపోయింది. పార్క్ ఇండస్ట్రియల్ సియుడాడ్ మిత్రాస్పైకి దూసుకెళ్లినట్లు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ నాయకులను కీర్తించడానికి మీరు ప్రజా నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది.
ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. గౌహతిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు జరుగుతుంటుండగా భార్య గరిమా సైకియా గార్గ్ ఏడుస్తూనే కనిపించారు. అస్సామీ మహిళలు ధరించే సాంప్రదాయ దుస్తులైన మేఖేలా చాదర్ ధరించారు. చితికి మంటలు అంటుకుంటున్న సమయంలో రెండు చేతులు జోడించారు. ఎక్కి.. ఎక్కి ఏడుస్తూనే కనిపించారు. పలువురు ఆమెను ఓదార్చుతూ కనిపించారు.
టెక్ సిటీ బెంగళూరులో ప్రధాన రహదారులన్నీ గుంతలమయం అయ్యాయి. దీంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు రిపేర్ చేయాలంటూ ఇటీవల బెంగళూరు వాసులు ఆందోళన కూడా చేశారు. అలాగే ప్రతిపక్ష బీజేపీ కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
దేశంలో రోజురోజుకి నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలు అమలవుతున్నా నేరస్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడొక చోట దారుణాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా అనుమానంతో కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా కన్న కూతురు ఎదుటే హతమార్చాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
అమెరికాలో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహం ఏర్పాటుకు ఎలా అనుమతి ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు.
పాలస్తీనా అనుకూల నిరసనలతో ఇటలీ అట్టుడుకింది. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిరాకరించారు. ఓ వైపు పాలస్తీనా రాజ్యం ఏర్పాటుకు ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ మద్దతు తెల్పుతుండగా ఇటలీ మాత్రం అందుకు నిరాకరించింది.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. కమర్కుచి ఎన్సీ గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ఇక కడసారి చూపు కోసం లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు.
కోల్‌కతాను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోల్‌కతా వీధులన్నీ జలమయం అయ్యాయి. బెనియాపుకూర్, కాలికాపూర్, నేతాజీ నగర్, గరియాహత్, ఎక్బాల్‌పూర్‌లో వరదలు ముంచెత్తాయి. వరదలు కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో జీనజీవనం స్తంభించింది.