మహారాష్ట్రలో మహా ఘోరం జరిగిపోయింది. డాక్టర్ కావాల్సిన ఓ విద్యాకుసుమం అర్థాంతరంగా రాలిపోయింది. ఎంబీబీఎస్ అడ్మిషన్ రోజే ఈలోకం నుంచి వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆశ్రమంలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఆశ్రమ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ సారథిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సోదాల్లో నిందితుడికి సంబంధించిన కారును గుర్తించగా.. దానిపై నకిలీ ఎంబసీ ప్లేట్లు గుర్తించారు.
రాగస తుఫాన్ తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా తైవాన్‌లో జలప్రళయం విరుచుకుపడింది. 195-200 కి.మీ వేగంతో తీవ్ర గాలులు, కుండపోతగా కురిసిన వర్షంతో తైవాన్ అతలాకుతలం అయింది.
న్యూయార్క్‌లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్యసమతి శిఖరాగ్ర సమావేశాలకు అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్ సుదీర్ఘ ప్రసంగం కూడా చేశారు. ఇక అరబ్-ఇస్లామిక్ సమ్మిట్‌లో ట్రంప్ పాల్గొన్నారు.
పసిడి ప్రియులకు ఉపశమనం లభించింది. ధరలకు బుధవారం కళ్లెం పడింది. గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న ధరలు నేడు మాత్రం బ్రేక్‌లు పడ్డాయి. తులం గోల్డ్ ధరపై రూ.320 తగ్గింది.
దాయాది దేశం పాకిస్థాన్‌పై అంతర్జాతీయ వేదికగా భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని.. సొంత ప్రజలనే బాంబులతో చంపేస్తోందని భారత్ విమర్శించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి ప్రసగించారు.
అమెరికాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. న్యూయార్క్‌లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు మాక్రాన్ వెళ్లారు. అయితే అదే సమయంలో ట్రంప్ కాన్వాయ్ కూడా వస్తోంది. దేశ అధ్యక్షుడు కాబట్టి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ రోడ్డుపై మాక్రాన్‌ను నిలిపివేశారు.
బీహార్ ఎన్నికల నేపథ్యంలో పాట్నాలో తొలిసారి కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల వ్యూహం, ఓట్ల చోరీ, ట్రంప్ సుంకాలు, వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
రాగస తుఫాన్ హాంకాంగ్, దక్షిణ చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు 200 కి.మీ వేగంతో గాలులు వీచడంతో ప్రధాన పట్టణాలన్నీ అతలాకుతలం అయ్యాయి. తుఫాన్ కారణంగా తైవాన్‌లో 14 మంది, ఫిలిప్పీన్స్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియాకు ఐక్యరాజ్యసమితిలో షాకింగ్ పరిణామం ఎదురైంది. యాదృచ్ఛికమో.. లేదంటే కావాలనే జరిగిందో తెలియదు గానీ.. యూఎన్ కార్యాలయంలో ట్రంప్, మెలానియా ఎస్కలేటర్ ఎక్కగానే హఠాత్తుగా ఆగిపోయింది