తన భర్తను కాల్చి చంపిన వ్యక్తిని తాను క్షమించేశానని చార్లీ కిర్క్ భార్య ఎరికా ప్రకటించారు. దీంతో సంతాప కార్యక్రమానికి హాజరైన వారంతా స్టాండింగ్ ఒవేషన్ చేశారు. ఎరికా ప్రకటనను అందరూ స్వాగతించారు. చార్లీ కిర్క్‌ను జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారం అరిజోనాలోని గ్లెండేల్లోని స్టేట్ ఫార్మ్ స్టేడియంలో స్మారక కార్యక్రమం నిర్వహించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చాలా రోజుల తర్వాత పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఇందుకు చార్లీ కిర్క్ సంతాప కార్యక్రమం వేదిక అయిది. ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్‌ను గుర్తు చేసుకుంటూ ఆదివారం స్మారక మెమోరియల్ సర్వీస్ జరిగింది.
జుబీన్ గార్గ్.. అస్సామీ గాయకుడు. అస్సామీ ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక మంది హృదయాలను గెలిచిన గాయకుడు. నిన్నామొన్నటిదాకా అంతగా పరిచయం లేని జుబీన్ గార్గ్. ఆయన మరణం తర్వాత.. ఆయన కోసం తరలివస్తున్న జనాలను చూస్తుంటే.. ప్రజల్లో గుండెల్లో ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారో అర్థమవుతోంది.
ప్రధాని మోడీ సోమవారం రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రూ.5,100 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. జలవిద్యుత్, మౌలిక సదుపాయాలు, మాతా త్రిపుర సుందరి ఆలయ అభివృద్ధి సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
ఇరాన్లో నకిలీ ఉద్యోగ ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలంటూ భారతీయులకు కేంద్రం హెచ్చరించింది. క్రిమినల్ ముఠాలు తప్పుడు ఉద్యోగ హామీలతో వ్యక్తులను ఆకర్షించి కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలకు భారతీయులెవరూ బలికావొద్దని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ కోరింది.
ఐటీ నగరం బెంగళూరు రహదారులు గుంతల మయంగా మారింది. ఏ రోడ్డు చూసినా భారీ గుంతలు ఏర్పాడ్డాయి. దీంతో ఉద్యోగాలకు వెళ్లే ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా నానా యాతన పడుతున్నారు. అయితే శనివారం ఉద్యోగులంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
భారతదేశంతో యుద్ధం జరిగితే సౌదీ అరేబియా ఇస్లామాబాద్‌ను కాపాడుతుందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. జియో టీవీతో మాట్లాడుతుండగా భారత్‌తో యుద్ధం జరిగితే సౌదీ సపోర్టుగా వస్తుందా? అని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా వస్తుంది... అందులో ఎలాంటి సందేహం లేదని బదులిచ్చారు.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణం ఆయన అభిమానులను తీవ్ర శోకంలో ముంచేసింది. తన గానంతో అస్సాం ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. అలాంటిది ఒక్కసారిగా హఠాన్మరణం చెందడం ఆయనను ప్రేమించేవారు.. అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఒక దశాబ్ద కాలంలో భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా సాధించలేని అభివృద్ధిని మోడీ చేసి చూపించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు వివరించారు.
భారతదేశంలోనే అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్‌ను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించనున్నారు. ముంబైలోని ఇందిరా డాక్ దగ్గర అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను రూ.7,870 కోట్లతో నిర్మించారు. ఈ టెర్మినల్‌ను మోడీ ప్రారంభించనున్నారు.