అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్‌కు మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. జుబీన్ గార్గ్ మరణంపై పెద్ద ఎత్తున అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జుబీన్ గార్గ్ భార్య అనుమతితో రీపోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.
గత ఢిల్లీ పాలకులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాని మోడీ విమర్శించారు. మోడీ సోమవారం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇటానగర్ సభలో మోడీ ప్రసంగించారు.
గుజరాత్‌లోని పోర్బందర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్‌నగర్ జెట్టీ దగ్గర జామ్‌నగర్‌కు చెందిన కార్గో షిప్ మంటల్లో కాలిపోయింది. 950 టన్నుల బియ్యం, 100 టన్నుల చక్కెరను తీసుకెళ్తుండగా హరిదాసన్ అనే కార్గో షిప్ మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైంది.
ఖైబర్ పఖ్తుంఖ్వా గ్రామంపై పాక్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపింది. 8 బాంబులు వేయడంతో 30 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) రహస్య స్థావరాలు లక్ష్యంగా పాక్ వైమానిక దళాలు దాడి చేయగా.. గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులెవరూ కూడా చనిపోలేదు. చనిపోయిన వారందరూ పౌరులే ప్రాణాలు కోల్పోయారు.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక రిపోర్టుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం కూలిపోయింది. దాదాపు 271 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ప్రమాదంపై రెండు సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.
బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లభించకపోవడం దేవుడు తనకు ఇచ్చిన అతి పెద్ద వరం అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన హల్బా సమాజ్ మహాసంఘ్ స్వర్ణోత్సవ వేడుకల్లో నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించారు.
ఐక్యరాజ్యసమితి కౌన్సిల్ సమావేశాల కోసం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆయన బృందం నేటి నుంచి ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్‌లో 80వ ఐరాస కౌన్సిల్ సమావేశం జరుగుతోంది.
ట్రంప్ సుంకాల ప్రభావమో.. లేదంటే హెచ్ 1బీ వీసాల ప్రభావమో తెలియదు గానీ.. బంగారు ధరలు మాత్రం పైపైకి వెళ్లిపోతున్నాయి. ధరలు తగ్గితే కొందామనుకుంటున్న గోల్డ్ ప్రియులకు రోజురోజుకు ధరలు షాకిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ధరలు దూసుకుపోతున్నాయి.
ఇకపై పాలస్తీనా రాజ్యం ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. పాలస్తీనా రాజ్య స్థాపనకు ఆయా దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేస్తామంటూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆపరేషన్ సిందూర్-2, 3 భాగాలు అనేది పాకిస్థాన్ తీరుపై ఆధారపడి ఉంటుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. మొరాకోలోని భారతీయ సమాజంతో జరిగిన సంభాషణలో రాజ్‌నాథ్‌సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.