DK Shivakumar: మోడీ నివాసం దగ్గర గుంతలు లేవా? కర్ణాటకలోనే ఉన్నాయా? డీకే.శివకుమార్ ఎదురుదాడి
- మోడీ నివాసం దగ్గర గుంతలు లేవా?
- కర్ణాటకలోనే ఉన్నాయా?
- బీజేపీపై డీకే.శివకుమార్ ఎదురుదాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ సిటీ బెంగళూరులో ప్రధాన రహదారులన్నీ గుంతలమయం అయ్యాయి. దీంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు రిపేర్ చేయాలంటూ ఇటీవల బెంగళూరు వాసులు ఆందోళన కూడా చేశారు. అలాగే ప్రతిపక్ష బీజేపీ కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కారణంగా ఐటీ కంపెనీలు తరలిపోతున్నాయని ఆరోపించింది. బెంగళూరు శిథిలావస్థకు చేరుకుంటోందని.. టెక్ హబ్‌ను గుంతల నగరంగా మార్చారంటూ కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి ఇటీవల ఆరోపించారు. రోడ్డు పరిస్థితులు బాగోలేకపోవడంతో కంపెనీలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయని తెలిపారు. బీజేపీ ఆరోపణలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ స్పందించారు.
‘‘రోడ్లపై గుంతలు కేవలం కర్ణాటకలోనే ఉన్నాయా? నిన్న నేను ఢిల్లీలోకి వెళ్తే ప్రధాని మోడీ నివాస రోడ్డులో కూడా గుంతలు కనిపించాయి. కానీ మీడియా మాత్రం కర్ణాటక రోడ్లనే మాత్రమే చూపిస్తున్నాయి.’’ అని డీకే.శివకుమార్ తిప్పికొట్టారు. భారీ వర్షాలు కారణంగా దేశ వ్యాప్తంగా రోడ్లు గుంతలమయం అయ్యాయన్నారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అయినా కూడా ఓ వైపు వర్షాలు పడుతున్నప్పటికీ వేలాది గుంతలు పూడ్చుతూనే ఉన్నామని చెప్పారు. దేశ వ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని.. దీనికి బీజేపీనే కారణం అన్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలోనే గుంతలను బీజేపీ చూపిస్తోందని ధ్వజమెత్తారు.
నవంబర్ నాటికి గుంతలను పూడ్చడానికి కాంట్రాక్టర్లకు తుది గడువు ఇచ్చామని, నగరవ్యాప్తంగా రోడ్డు మరమ్మత్తు, నిర్మాణం కోసం రూ.1,100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘మా లక్ష్యం పరిశుభ్రమైన బెంగళూరు, సజావుగా ట్రాఫిక్ సాగడం. గుంతలను వీలైనంత త్వరగా తొలగించేలా చూస్తాం.’’ అని డీకే.శివకుమార్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!