మావోయిస్టుల ఏరివేతలో ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు మావోయిస్టు జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. జగ్గు కుర్సం అలియాస్ రవి అలియాస్ రమేష్ (28), అతని భార్య కమలా కుర్సం (27) ను సెప్టెంబర్ 23న చంగోరభట్ట దగ్గర అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో ‘ఐ లవ్ ముహమ్మద్’’ ప్రచారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బరేలీ స్థానిక మతాధికారి, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రజా ‘ఐ లవ్ ముహమ్మద్’ మద్దతుగా నిరసనలకు శుక్రవారం పిలుపునిచ్చారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్గర్ యోజన పథకాన్ని ప్రారంభించి 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 10,000 జమ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తానూ.. నితీష్ కుమార్ బీహార్ అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
అమెరికాతో పాకిస్థాన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని.. దీనిపై చైనా ఆందోళన చెందడం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. బ్రిటిష్-అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడారు.
టీవీకే చీఫ్ విజయ్‌కు చుక్కెదురైంది. సీఎం స్టాలిన్, కుటుంబ సభ్యులపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ విజయ్‌పై తిరుచ్చి ఎస్పీ కార్యాలయంలో డీఎంకే న్యాయవాది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగాన్ని భారత్ తిప్పికొట్టింది. భారత్ దౌత్యవేత్త పెటల్ గహ్లోట్ మాట్లాడుతూ.. అణు బ్లాక్ మెయిల్ ముసుగులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఏ మాత్రం అంగీకరించబోమని తేల్చి చెప్పారు.
వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సమావేశం అయ్యారు. దాదాపుగా 90 నిమిషాల పాటు రహస్య చర్చలు జరిగాయి. మీడియాను లోపలికి అనుమతించలేదు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఒక మహిళా ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణతో ఫోన్లో వాగ్వాదం పెట్టుకుని ఇరకాటంలో పడ్డారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా మరో మహిళా రైతుతో అజిత్ పవార్ వాగ్వాదం పెట్టుకుని వివాదంలో చిక్కుకున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు దసరా కానుక అందింది. శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున ఖాతాల్లో జమయ్యాయి. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
మోడీ-పుతిన్ సంబంధాలపై నాటో చీఫ్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో ఎలా ముందుకెళ్తున్నారన్న విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోడీ ఆరా తీసినట్లు నాటో చీఫ్ పేర్కొన్నారు.