అమెరికాతో పాకిస్థాన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని.. దీనిపై చైనా ఆందోళన చెందడం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. బ్రిటిష్-అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడారు. చైనా, అమెరికాతో పాకిస్థాన్‌కు ఉన్న సంబంధాలపై అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. తమకు చైనానే అగ్ర మిత్ర దేశమని తేల్చి చెప్పారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ 90 నిమిషాల పాటు రహస్య చర్చలు నిర్వహించారు. ఈ అంశంపై ఖవాజా ఆసిఫ్ స్పందించారు. రెండు దేశాల మధ్య మంచి భాగస్వామ్యం ఉందని.. దీనిపై చైనా ఏ మాత్రం ఆందోళన చెందదని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Vijay: టీవీకే చీఫ్ విజయ్‌కు చుక్కెదురు.. స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తిరుచ్చిలో ఫిర్యాదు
పాకిస్థాన్ తన ఆయుధాల్లో 80 శాతం చైనా నుంచే కొనుగోలు చేస్తుంది. అయితే తాజాగా ఖనిజ ఒప్పందాలు, క్రిష్టో ఒప్పందాలు, మరికొన్నింటిని ట్రంప్‌తో పాకిస్థాన్ సంబంధాలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చైనాతో సంబంధం ఏమైనా దెబ్బతీస్తుందా? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఆసిఫ్ తేల్చి చెప్పారు. అలాంటి ఆందోళనే లేదని.. చైనాతో 50 ఏళ్ల అనుబంధం ఉందని పేర్కొన్నారు. చైనా మాకు చాలా నమ్మకమైన మిత్రదేశమని చెప్పుకొచ్చారు. ఆయుధాలు దాదాపు చైనా నుంచే వస్తాయని.. మునుపటి కంటే ఎక్కువగా చైనాతోనే ఎక్కువ సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. చైనా నమ్మదగిన దేశమని.. భౌగోళికతను కూడా పంచుకుంటున్నట్లు ఆసిఫ్ చెప్పారు.
ఇది కూడా చదవండి: India: పాక్ ప్రోత్సాహంతోనే భారత్‌లో ఉగ్ర దాడులు.. యూఎన్‌లో షరీఫ్ ప్రసంగాన్ని తిప్పికొట్టిన భారత్
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశం అయ్యారు. 90 నిమిషాల పాటు రహస్య చర్చలు జరిపారు. ఆయా అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇద్దరు నాయకులు గొప్ప నాయకులు అంటూ ట్రంప్ ప్రశంసించారు. ఇక వైట్‌హౌస్‌లో ఆహ్లాదకరంగా చర్చలు జరిగాయని పాకిస్థాన్ పీఎంవో తెలిపింది.