యూకేలోని మాంచెస్టర్ సినాగోగ్‌లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. యూదుల ప్రార్థనా మందిరం వెలుపల ఉన్న వారిని వాహనంతో ఢీకొట్టి.. అనంతరం కత్తితో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారు.
భారత్ బలమేంటో ఆపరేషన్ సిందూర్‌తో మన దళాలు పాకిస్థాన్‌కు రుచిచూపించాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దసరా సందర్భంగా భుజ్‌లో సైనిక దళాలతో కలిసి రాజ్‌నాథ్‌సింగ్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌సింగ్ హెచ్చరికలు జారీ చేశారు.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఓ ఈవెంట్ కోసం జుబీన్ గార్గ్ సింగపూర్ వెళ్లారు. అయితే ఈవెంట్ నిర్వాహకులు జుబీన్ గార్గ్‌ను సముద్రంలోకి బోటింగ్‌కు తీసుకెళ్లారు. జుబీన్ గార్గ్ అప్పటికే నీరసంగా ఉన్నట్లు కనిపించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (83)కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేసినట్లుగా ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఖర్గే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మైక్రోసాఫ్ట్‌లో కీలక హోదాలో ఉన్న లీసా మోనాకోను ఉద్యోగం నుంచి తొలగించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం లీసా మోనాకో మైక్రోసాఫ్ట్‌లో గ్లోబల్ అఫైర్స్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బరాక్ ఒబామా హయాంలో జాతీయ భద్రతా సీనియర్ సలహాదారుగా కూడా విధులు నిర్వర్తించారు.
లడఖ్ రాష్ట్ర సాధన కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైల్లో ఉంచారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ ఇటీవల పెద్ద ఎత్తున లడఖ్‌లో హింస చెలరేగింది. బీజేపీ కార్యాలయం సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలను అల్లరిమూకలు తగలబెట్టారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రథమ మహిళ మెలానియా మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా చర్చించుకుంటున్నారు.
ప్రధాని మోడీ ఒడిశాలోని ఝార్సుగూడలో రూ. 60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. భారతదేశం అంతటా 97,500 కి పైగా టెలికాం టవర్లు ప్రారంభించారు.
బంగారం ధరలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. ఈ వారంలో రెండు రోజులు తగ్గినట్టే తగ్గి మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఫార్మా దిగుమతులపై ట్రంప్ 100 శాతం సుంకం విధించారు. ఈ ప్రభావం పసిడిపై తీవ్ర ప్రభావం పడుతోంది.