* నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. బ్లింకిట్, జెఫ్టో వంటి క్విక్ కామర్స్ సంస్థల సేవలు బంద్.. సమ్మెలో పాల్గొంటున్న జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల డెలివరీ సిబ్బంది
* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ..
* అమరావతి: నేటి నుంచి జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అమలు.. కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల.. ఏపీలో 28కి చేరిన జిల్లాల సంఖ్య
* న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్.. డిసెంబర్ 31 సందర్భంగా మెట్రోరైళ్ల సమయం పొడిగింపు.. నేడు రాత్రి ఒంటిగంట వరకు మెట్రోరైళ్ల సేవలు
* హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో.. నేడు బార్లు, క్లబ్‌లు, ఈవెంట్ నిర్వాహకులకు టైమ్ లిమిట్.. అర్ధరాత్రి ఒంటి గంట వరకే బార్లు, క్లబ్‌లకు అనుమతి.. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులకు అనుమతి
* న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. నేడు రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్‌పైకి నో ఎంట్రీ.. బేగంపేట్, టోలీచౌకీ మినహా అన్ని ఫ్లైఓర్లు మూసివేత.. ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్‌ప్రెస్ వేపైకి అనుమతి.. నేడు రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్ సిటీలోకి ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీ..
* నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎస్సి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన..
* అమరావతి: నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం.. నూతన సంవత్సరం సందర్భంగా 1వ తేదీ బదులు డిసెంబర్ 31వ తేదీన… ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. 63.12 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు రూ.2,743 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
* తిరుమల: ఇవాళ వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో చక్రస్నానం మహోత్సవం.. శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించిన అర్చకులు
* విశాఖ: నేటి నుంచి సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభ.. జనవరి 4 వరకు జరిగే సమావేశాల్లో కార్మిక చట్టాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం పై చర్చలు
* తిరుపతి: వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో చక్రస్నానం మహోత్సవం.. పద్మా పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించిన అర్చకులు…పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
* శ్రీ సత్యసాయి : మడకశిరలో ఆర్డీవో రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించునున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు.
* నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన.. ముదిగుబ్బ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనం భవనాన్ని ప్రారంభిస్తారు. ముదిగుబ్బ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. రామస్వామి తండాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. నూతనంగా నిర్మించిన సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, హెల్త్ & వెల్నెస్ సెంటర్లని ప్రారంభిస్తారు… రాళ్లనంతపురం,కోడవండ్లపల్లి రహదారిపై KM 8/2-8 వద్ద పునర్నిర్మించిన ఎత్తైన కాజ్‌వే వంతెనను ప్రారంభిస్తారు…
* తూర్పుగోదావరి జిల్లా: మంత్రి కందుల దుర్గేష్ పర్యటన వివరాలు.. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో NTR పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో.. నిడదవోలు మండలం రావిమెట్ల గ్రామంలో NTR పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.