Taliban-Priyanka Gandhi: మహిళా జర్నలిస్టులను ఎందుకు పిలువలేదు.. కేంద్రంపై ప్రియాంకాగాంధీ ధ్వజం
- మహిళా జర్నలిస్టులను ఎందుకు పిలువలేదు
- కేంద్రంపై ప్రియాంకాగాంధీ ధ్వజం
- అమీర్ ఖాన్ ముత్తాకీ ప్రెస్‌మీట్‌లో కనిపించని మహిళా జర్నలిస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ఘనిస్థాన్ బృందం భారత్‌లో పర్యటిస్తోంది. శుక్రవారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. అనంతరం ఢిల్లీలోని ఆప్ఘనిస్థాన్ రాయబార కార్యాలయంలో ఆ దేశ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ విలేకర్ల సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు కూడా లేరు. కేవలం పురుష జర్నలిస్టులను మాత్రమే పిలిచి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఇది తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్రం తీరును ప్రతిపక్ష నేతలు తప్పుపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతా క్లోజ్.. బీజేపీపై ఎస్పీ నేతల ధ్వజం
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ‘‘భారతదేశంలో అత్యంత సమర్థులైన మహిళలను అవమానించడం మన దేశంలో ఎలా అనుమతించబడిందని నిలదీశారు. దేశానికి మహిళలు వెన్నెముక, గర్వకారణం’’. అని ప్రియాంకాగాంధీ పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోడీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Trump-Machado: నోబెల్ శాంతి గ్రహీత మచాడోకు ట్రంప్ ఫోన్.. సుదీర్ఘంగా సంభాషణ!
మరో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కీలక పోస్ట్ పెట్టారు. ఆఫ్ఘనిస్థాన్ మంత్రి పెస్‌మీట్‌లో మహిళలను అనుమతించనప్పుడు పురుష జర్నలిస్టులు ఎందుకు బహిష్కరించలేదని అడిగారు. మీడియా సమావేశం నుంచి వాకౌట్ చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఈ విషయం తనకు షాకిచ్చిందన్నారు.
విమర్శలపై కేంద్రం స్పందించింది. ప్రెస్‌మీట్ ఆహ్వానాలు ముంబైలోని ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ జనరల్ నుంచే ఎంపిక చేస్తారని.. ఎంపిక చేసిన జర్నలిస్టులకు మాత్రమే ఆహ్వానాలు అందాయన్నారు. ఢిల్లీలోని ఆప్ఘనిస్థాన్ రాయబార కార్యాలయం కేంద్ర ఆధీనంలో ఉండదని.. ఇది వారి ఎంపిక మాత్రమేనని స్పష్టం చేసింది.
ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం నడుస్తోంది. మహిళలపై భయంకరమైన ఆంక్షలు ఉంటాయి. విశ్వవిద్యాలయాల్లో మహిళలు రాసిన పుస్తకాలను కూడా నిషేధం విధించారు. బహిరంగంగా తిరిగే స్వేచ్ఛ కూడా ఉండదు. అన్ని విషయాల్లో ఆంక్షలు ఉంటాయి.
Prime Minister @narendramodi ji, please clarify your position on the removal of female journalists from the press conference of the representative of the Taliban on his visit to India.
If your recognition of women’s rights isn’t just convenient posturing from one election to…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 11, 2025
I am shocked that women journalists were excluded from the press conference addressed by Mr Amir Khan Muttaqi of Afghanistan
In my personal view, the men journalists should have walked out when they found that their women colleagues were excluded (or not invited)
— P. Chidambaram (@PChidambaram_IN) October 11, 2025
తాజావార్తలు
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?