Suresh Maddala
Author- NTV Telugu-
US: విమానంలో పైలట్ మృతి.. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
అమెరికా నుంచి ఇస్తాంబుల్‌కు బయల్దేరిన విమానం మార్గమధ్యలో ఉండగా పైలట్ హఠాత్తుగా ప్రాణాలు వదిలాడు. అయితే వెంటనే న్యూయార్క్‌లో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం యూఎస్ నుంచి టర్కీకి బయల్దేరింది. -
Maharashtra: పూణెలో దారుణం.. మహిళను చంపిన చిరుత
మహారాష్ట్రలో దారుణం జరిగింది. పొలం పనులు చేసుకుంటున్న మహిళపై చిరుతపులి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. పూణెకు సమీపంలోని పింప్రి-పెంధార్ గ్రామంలో సుజాత ధేరే అనే మహిళ పొలంలో పని చేస్తుంది. సోయాబీన్ పొలంలో పని చేస్తుండగా మాటు వేసిన చరుత పులి ఒక్కసారిగా మహిళపై దాడి చేసింది. -
AAP: ఆప్ సంచలన ప్రకటన.. ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడి
హర్యానా ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమిలో చీలికలు తెచ్చేలా కనిపిస్తోంది. హర్యానా ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆప్ తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ హస్తం పార్టీ మాత్రం.. రెండు, మూడు సీట్లు కంటే ఎక్కువ ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. -
Delhi: మరోసారి ఆప్ వర్సెస్ కేంద్రం.. సీఎం అతిషి ఇంట్లో వస్తువుల తొలగింపుపై వాగ్యుద్ధం
ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్- ఆప్ ప్రభుత్వం మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. రెండ్రోజుల క్రితమే ముఖ్యమంత్రి అతిషి.. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన అధికారిక బంగ్లాలోకి షిప్ట్ అయ్యారు. అయితే తాజాగా బంగ్లా నుంచి అతిషికి సంబంధించిన వస్తువులను బలవంతంగా తొలగించి సీలు చేశారు. -
EC: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఎన్నికల సంఘం లేఖ.. ప్రతినిధి బృందం కలిసేందుకు అనుమతి
హర్యానా ఎన్నికల ఫలితాలను అంగీకరించబోమని కాంగ్రెస్ ప్రకటించింది. ఫలితాలను తారుమారు చేశారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరాం రమేష్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని వ్యాఖ్యానించారు. -
Israel: లెబనాన్‌కు నెతన్యాహు వీడియో వార్నింగ్.. గాజాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరిక
లెబనాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హిజ్బుల్లా లక్ష్యంగా దాడులు తీవ్రం కాబోతున్నాయని.. తక్షణమే సరిహద్దు ప్రజలు ఖాళీ చేయాలని వీడియో ద్వారా నెతన్యాహు సందేశం పంపించారు. గాజాకు పట్టిన గతే హిజ్బుల్లాకు పడుతుందని తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. -
Stock market: ఒక్కరోజు లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాల్లో ముగిసింది. గత వారంలో పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా మార్కెట్ తీవ్ర నష్టాలను చవిచూసింది. మంగళవారం కాస్త ఒడిదుడుకుల నుంచి తేరుకుని లాభాల్లోకి వచ్చింది. బుధవారం ఉదయం కూడా లాభాల్లోనే సూచీలు మొదలయ్యాయి. -
Nobel Prize: కెమిస్ట్రీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు
రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు లభించాయి. డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్, జాన్ జంపర్లకు కెమిస్ట్రీలో నోబెల్ అవార్డులు లభించాయి. ఈ ముగ్గురు రసాయన శాస్త్రంలో 2024 నోబెల్ బహుమతులను గెలుచుకున్నారని అవార్డు ప్రదాన సంఘం బుధవారం తెలిపింది. -
Delhi: పేదలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 2028 వరకు ఉచిత బియ్యం పంపిణీ
న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూట్రిషన్ సెక్యూరిటీ కోసం కేంద్రం రూ. 17,082 కోట్లు కేటాయించింది. వంద శాతం కేంద్రం నిధులు కేటాయించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. -
Nirmala Sitharaman: సెబీపై వాస్తవాలు తెలుసుకుని విమర్శలు చేయండి
సెబీ చీఫ్ మాధబిపై అమెరికా సంస్థ హిండెన్‌బర్ చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. అనంతరం విపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున సెబీపై విమర్శలు చేశారు. తాజాగా ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. సెబీపై వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రజలకు ఆర్థిక మంత్రి సూచించారు.
తాజావార్తలు
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!