Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wedding Date Confirmed: టీమిండియా క్రికెటర్ రింకు సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ వివాహ తేదీ ఖరారైంది. ఇరు కుటుంబాల సమ్మతితో డిసెంబర్ 4, 2026న లక్నోలోని రమాడా హోటల్లో వీరి వివాహం జరగనుంది. పెళ్లి తేదీ, వేదిక ఖరారు కావడంతో ఇరు కుటుంబాలు వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.
రింకు సింగ్, ప్రియా సరోజ్‌ల ఎంగేజ్మెంట్ 2025 జూన్ 8న లక్నోలోని ‘ది సెంట్రమ్’ హోటల్లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ ప్రైవేట్ వేడుక అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంగేజ్మెంట్ తర్వాత వీరి వివాహంపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది.
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ఆ చర్చలకు తెర దించుతూ.. ఇప్పుడు డిసెంబర్ 4న లక్నోలోని రమాడా హోటల్లో వివాహం నిర్వహించాలని నిర్ణయించారు. వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్‌లోని మచ్లీషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె మచ్లీషహర్ నుంచి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ కూడా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం కేరాకత్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
రింకు సింగ్ భారత క్రికెట్లో ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో తన దూకుడైన బ్యాటింగ్‌తో గుర్తింపు పొందాడు. ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన ఇన్నింగ్స్‌తో అతడు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ప్రియా సరోజ్‌తో అతని నిశ్చితార్థం తర్వాత వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందనే ఆసక్తి కొనసాగింది. ఇక ఎట్టకేలకు వివాహ తేదీ, వేదిక ఖరారు కావడంతో రింకు సింగ్, ప్రియా సరోజ్ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!