రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు లభించాయి. డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్, జాన్ జంపర్‌లకు కెమిస్ట్రీలో నోబెల్ అవార్డులు లభించాయి. ఈ ముగ్గురు రసాయన శాస్త్రంలో 2024 నోబెల్ బహుమతులను గెలుచుకున్నారని అవార్డు ప్రదాన సంఘం బుధవారం తెలిపింది.
ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకుగాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హస్సాబిస్, జంపర్‌ను ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. కంప్యుటేషనల్ ప్రొటీన్ డిజైన్‌కుగాను డేవిడ్ బెకర్, ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్‌కు డెమిస్, జంపర్‌లు ఈ పురస్కారాలను అందుకోనున్నారు.
వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14వరకు కొనసాగనుంది. సోమవారం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించగా.. మంగళవారం భౌతికశాస్త్రంలో నోబెల్ అవార్డులను ప్రకటించారు. బుధవారం రసాయనశాస్త్రంలో నోబెల్‌కు పురస్కారానికి ఎంపికైన వారి జాబితా వెలువడింది. గురువారం సాహిత్యం విభాగానికి సంబంధించి ప్రకటన ఉంటుంది. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.