Suresh Maddala
Author- NTV Telugu-
Kolkata: వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక పరిణామం.. 50 మంది సీనియర్ వైద్యుల రాజీనామా
కోల్‌కతా వైద్యురాలి అత్యాచార ఘటన మరోసారి ఉధృతం అవుతోంది. ఆగస్టు 9న ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇక ఆమెకు మద్దతుగా జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనలు చేపడుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
TamilNadu: చెన్నైలో తప్పిన విమానం ప్రమాదం.. ల్యాండ్ అవుతుండగా పేలిన టైర్
తమిళనాడులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ అవుతుండగా టైర్ పేలిపోయింది. దీంతో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది హడలెత్తిపోయారు. మస్కట్ నుంచి 146 మంది ప్రయాణికులతో చెన్నై చేరుకుంది. -
Haryana Polls: ఎగ్జిట్ పోల్స్‌తో కాంగ్రెస్‌లో జోష్.. సీఎం కుర్చీపై మొదలైన లాబీయింగ్!
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు 61 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే పోలింగ్ ముగియగానే సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఆ సంస్థలు చేసిన సర్వేలు విడుదల చేశాయి. దాదాపు అన్ని సర్వేలు హర్యానాలో కాంగ్రెస్‌కే మొగ్గుచూపించాయి. -
Mumbai: మెట్రో ఫేజ్-3ను ప్రారంభించిన మోడీ.. విద్యార్థులతో ప్రధాని ముచ్చట్లు
ప్రధాని మోడీ శనివారం మహారాష్ట్రలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక ముంబైలో మెట్రో లైన్-3ను ప్రారంభించారు. అనంతరం బీకేసీ నుంచి శాంతాక్రజ్ స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు -
Sabarimala: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం షాక్.. ఈ ఏడాది దర్శనం వారికే..!
అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం షాకిచ్చింది. శబరిమల దర్శనంపై పినరయ విజయన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ భక్తులకు మాత్రమే దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులంతా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించింది. -
Emirates flights: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం.. పేజర్ల, వాకీటాకీలపై నిషేధం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ఇకపై పేజర్లు, వాకీటాకీలపై నిషేధం విధించినట్లు ఆ సంస్థ తెలిపింది. దుబాయ్‌లో ప్రయాణికుల దగ్గర దొరకడంతో పోలీసులు వాటిని జప్తు చేశారు. -
Zomato: భార్యతో కలిసి ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో సీఈవో గోయల్
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారమెత్తారు. భార్యతో కలిసి జొమాటో డ్రస్‌లో ఇద్దరూ ఫుడ్ డెలివరీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఇదే మాదిరిగా చేసిన గోయల్.. ఈసారి భాగస్వామిని వెంటవేసుకుని ఫుడ్ డెలివరీ చేసి ఆశ్చర్యపరిచారు. -
Haryana Polls: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. పోటెత్తిన హర్యానా ఓటర్లు
హర్యానాలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూతులకు భారీగా తరలివచ్చారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం ఓటింగ్ నమోదు కాగా.. సాయంత్రం 6 గంటలకు ముగిసే సమయానికి భారీగానే పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు భావిస్తున్నారు. -
Nitish Kumar: నితీష్‌కుమార్‌కు భారతరత్న డిమాండ్.. బీహార్‌లో వెలసిన పోస్టర్లు
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం మోడీ 3.0 ప్రభుత్వంలో జేడీయూ కీలక పాత్ర పోషిస్తోంది. పైగా త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలంటూ పాట్నా నగరమంతా జేడీయూ శ్రేణులు పోస్టర్లు అంటించారు. భారతరత్నకు నితీష్ కుమార్ అర్హులని పోస్టర్లలో పేర్కొన్నారు. -
Supreme Court: రేషన్ కార్డుల జాప్యంపై ధర్మాసనం తీవ్ర అసహనం.. ఓపిక నశించిందని వ్యాఖ్య
రేషన్ కార్డుల జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వలస కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్నా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రం రేషన్ కార్డులు జారీ చేయడం లేదు. దీంతో ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రాల తీరు ఆందోళనకరమని, ఈ విషయంలో తమకు ఓపిక నశించిందని ధ్వజమెత్తింది.
తాజావార్తలు
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
ట్రెండింగ్
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!