PM Modi: పుతిన్‌కు ప్రధాని మోడీ విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. వరుసగా ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ గెలుపొందారు. ఈ మేరకు ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా పుతిన్‌కు మోడీ విషెస్ చెప్పారు. రాబోయే రోజుల్లో భారత్-రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మూడురోజుల పాటు జరిగిన ఎన్నికల్లో పుతిన్ భారీ విజయం సాధించారు. సుమారు 87 శాతం ఓటింగ్ సంపాదించారు. తాజా ఫలితంతో మరో ఆరేళ్ల పాటు రష్యాను పాలించనున్నారు. గత 24 ఏళ్లుగా అధికారంలో చెలామణి అవుతున్నారు. ఈ పదవీకాలం పూర్తయితే రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా పుతిన్ రికార్డు సృష్టించనున్నారు.ఇటీవలే రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ మృతిపై ఆయా దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. నావల్నీ హత్యకు గురై ఉంటారని అనుమానించారు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఇది కూడా చదవండి: Premikudu : ప్రేమికులారా గెట్ రెడీ.. ప్రేమికుడు మళ్ళీ వస్తున్నాడు!
ఇదిలా ఉంటే రష్యా-ఉక్రెయిన్ మధ్య గత రెండేళ్లుగా యుద్ధం సాగుతోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భవంతలు నేలమట్టమయ్యాయి. ఇప్పటికే యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మరోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నికయ్యారు. భవిష్యత్‌లో పరిస్థితి ఇంకెలా ఉంటాయో చూడాలి. ఇప్పటికే పశ్చిమదేశాలకు అణు హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌కు సహకరిస్తే.. అణు ప్రమాదం తప్పదని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.
తాజాగా ప్రధాని మోడీ కూడా ఇండియాలో ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్డీఏకి 400 సీట్లే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు.
Warm congratulations to H.E. Mr. Vladimir Putin on his re-election as the President of the Russian Federation. Look forward to working together to further strengthen the time-tested Special & Privileged Strategic Partnership between India and Russia in the years to come.…
— Narendra Modi (@narendramodi) March 18, 2024
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!