ప్రముఖ సోషల్ మీడియా వేదికైన ఇన్‌స్టాగ్రామ్‌లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణం చేత సర్వీసుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో యూజర్లు అయోమయానికి గురవుతున్నారు. సర్వీస్ అంతరాయంపై ఫిర్యాదులు చేశారు. పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
పలువురికి ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు గందరగోళానికి గురయ్యారు. యూప్ ఓపెన్ కావడం లేదని.. ఇమేజ్ అప్‌లోడ్ కావట్లేదని వాపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం మందికి ఈ ఇబ్బందులు తలెత్తినట్లుగా తెలుస్తోంది. సమస్యను పరిష్కరించాలంటూ ‘ఎక్స్’ వేదికగా కంప్లంట్ చేస్తున్నారు.
ఇటీవల కూడా సోషల్ మీడియాకు సంబంధించిన యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు గంట పాటు నిలిచిపోయాయి. దీంతో యూజర్లంతా అసహనానికి గురయ్యారు. ఎందుకిలా జరిగిందో తెలియక కోట్లాది నెటిజన్లు హైరానా పడ్డారు. త్వరగా సర్వీసులు పునరుద్ధరించాలని పోస్టులు పెట్టారు. అనంతరం కొద్దిసేపటికే ఒక్కొక్కటిగా సర్వీసులను పునరుద్ధరించారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.