దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్న ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రెండు రోజుల టూర్ ఖరారైంది. మార్చి 21, 22 తేదీల్లో ప్రధాని మోడీ భూటాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
మోడీ మార్చి 21, 22న రెండ్రోజుల పాటు భూటాన్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలం నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోడీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది.
పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. భూటాన్ రాజు హిస్ మెజెస్టి జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అలాగే భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గేతో కూడా భేటీ అయి మోడీ చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా ముందుకు సాగనున్నారు.
ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్‌లో కుప్పకూలిన బొగ్గు గని.. 12 మంది దుర్మరణం..
ఇదిలా ఉంటే భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే జనవరిలో రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా గత వారం ఐదు రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చారు. టోబ్గే మార్చి 14న ఢిల్లీలో మోడీతో సమావేశమయ్యారు, ఈ సమయంలో భూటాన్‌ను సందర్శించాల్సిందిగా మోడీని ఆహ్వానించారు. ఈ ఏడాది జనవరిలో రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత టోబ్గే విదేశీ పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. భారతదేశం-భూటాన్ మధ్య ప్రత్యేక భాగస్వామ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై దృష్టి సారిస్తూ ప్రధాని మోడీతో చర్చలు జరిపారు.
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్డీఏకి 400 సీట్లు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం మోడీ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తొలి విడతలో దక్షిణాది రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరగనుంది. దీంతో ఆయన సౌతిండియాపై దృష్టి పెట్టారు.
