Pakistan: గ్వాదర్ పోర్ట్‌పై బలూచ్ మిలిటెంట్ల దాడి.. 8 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్ట్‌పై బలూచ్ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. సాయుధులైన బలూచ్ తీవ్రవాదులు గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్‌లోకి చొచ్చుకెళ్లి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై సంఘటనా స్థలికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 8 మంది తీవ్రవాదులు మరణించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోర్ట్‌పై దాడికి పాల్పడింది తామేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రవాదాన్ని ఏ మాత్రం సహించబోమంటూ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగింది.
పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్‌గా పిలిచే బలూచిస్థాన్ ప్రాంతం అనేక కొండలతో కూడిన ప్రాంతం. స్వాతంత్య్రం కోసం ఇక్కడ అనేక గ్రూపులు కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నాయి. చైనా- పాకిస్థాన్ ఎనకమిక్ కారిడార్ ప్రాజెక్టులను ఈ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బీఎల్‌ఏ వేర్పాటువాద సంస్థ చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్థాన్‌లోని గ్యాస్, ఖనిజ వనరులను చైనా, పాక్ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది.
Also Read
- Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
- Saikrishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం..
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
ఇది కూడా చదవండి: LSG: లోక్నోకు మరో షాక్.. ఐపీఎల్కు ఇంగ్లీష్ పేసర్ దూరం..
పాకిస్థాన్‌లోని సమస్యాత్మకమైన బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ప్రాంతంలో పలు పేలుళ్లు సంభవించగా.. భారీ ఆయుధాలతో కూడిన బలూచ్ మిలిటెంట్లు బుధవారం గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని మీడియా సంస్థలు తెలిపాయి. ఇదిలా ఉంటే గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్‌పై దాడిని భద్రతా బలగాలు విఫలం చేశాయి. దాడి చేసిన ఎనిమిది మందిని హతమార్చాయని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
As Per Initial reports, Pakistan's #Balochistan Port City, #Gwadar was attacked by Terrorist, several explosions and heavy gunfire are currently continuing pic.twitter.com/n0gGolhkSt
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) March 20, 2024
There are reports of a complex attack on the #Gwadar Port Authority (GPA). Simultaneous explosions & firing have been heard in the area.
GPA hosts sensitive govt installations, including Gwadar port where #Chinese engineers are working to build Pakistan’s third largest port.… pic.twitter.com/s10Y3loOcO
— Bahot | باہوٹ (@bahot_baluch) March 20, 2024
తాజావార్తలు
-
Zodiac Signs : దసరా వేళ ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
-
Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
-
Pine Labs: నెల రోజుల్లో 25% ప్రాఫిట్.. మరో 30% పెరిగే ఛాన్స్ ఉందట!
-
Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
-
Nani : డబ్బులిచ్చి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకే ఆ కోర్టు ఆర్డర్.. ఫేక్ రివ్యూలపై నాని షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!