రాజ్యసభలో సుదీర్ఘ కాలం పాటు దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సభ్యుడిగా కొనసాగిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పదవీకాలం బుధవారంతో ముగుస్తోంది. మరికొన్ని గంటల్లో 33 ఏళ్ల రాజ్యసభ ప్రస్థానానికి ముగింపు పలకనున్నారు. 1991, అక్టోబర్‌లో రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు.
ఇది కూడా చదవండి: Istanbul: టర్కీలో భారీ అగ్ని ప్రమాదం..29 మంది దుర్మరణం..
ఆర్థిక వ్యవస్థలో అనేక సాహసోపేతమైన సంస్కరణలకు మన్మోహన్ సింగ్ నాంది పలికారు. 1991 అక్టోబర్‌లో తొలిసారిగా సభలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక 1991 నుంచి 1996 వరకు పీవీ.నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. అనంతరం 2004 నుంచి 2014 వరకు.. అనగా 10 ఏళ్ల పాటు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా పేరు సంపాదించారు.
ఇది కూడా చదవండి: Rajya sabha: ముగిసిన 54 మంది సభ్యుల పదవీకాలం.. ఎవరెవరంటే!
91 ఏళ్ల మన్మోహన్ సింగ్ పదవీకాలం ఏప్రిల్ 3న పూర్తికావడంతో ఖాళీగా ఉన్న సీటును సోనియా గాంధీ భర్తీ చేస్తున్నారు. తొలిసారిగా ఆమె రాజస్థాన్ నుంచి ఎగువసభలో అడుగుపెడుతున్నారు. మన్మోహన్‌తో పాటు ఏడుగురు కేంద్ర మంత్రులు కూడా పదవీ విరమణ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య , పశుసంవర్ధక మరియు మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే మరియు సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ మంగళవారంతో రాజ్యసభలో పదవీకాలం ముగిసింది. ఇక పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పదవీ కాలం బుధవారంతో ముగియనుంది. ఈ కేంద్రమంత్రులందరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అశ్విని వైష్ణవ్, మురుగన్‌లకు మరోసారి రాజ్యసభ పదవి లభించింది. మంగళవారం (ఏప్రిల్ 2) 49 మంది సభ్యులు పదవీ విరమణ చేయగా.. ఐదుగురు బుధవారం (ఏప్రిల్ 3) పదవీ విరమణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mahua moitra: మహువా మొయిత్రాకు షాక్.. ఈడీ కేసు నమోదు