జమ్మూకాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో భూకంపం సంభవించినట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏకంగా రాంబన్-గూల్ రహదారి మధ్య సుమారు 1 కి.మీ మేర భూమి కుంగిపోయింది. దీంతో పెర్నోట్ గ్రామంలో సుమారు 30 ఇళ్ళు దెబ్బతిన్నాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఇళ్లల్లోంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలపై అధికారుల దృష్టి పెట్టారు. ఇంతగా భూమికి పగుళ్లు ఏర్పడడం.. భారీగా కుంగిపోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. దాదాపు 60 వేల మంది ప్రజలు ఇళ్లులు ఖాళీ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Perni Nani: పవన్ కు చిరంజీవి కంటే చంద్రబాబంటేనే ఎక్కువ ఇష్టం
అప్రమత్తమైన పోలీసులు.. పలు ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేశారు. అలాగే విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దాదాపు 5 కిలోమీటర్ల మేర పగుళ్లు ఏర్పడినట్లుగా సమాచారం. మరోవైపు రోడ్ల మరమ్మత్తులు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. వర్షపు నీరు వల్లే నేల కుంగినట్లుగా భావిస్తున్నారు. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.
#WATCH | Ramban, J&K: Due to the sinking of land for about 1 km at the Ramban-Gool road since last night, about 30 houses have been damaged in Pernote village, 6 Km from Ramban. pic.twitter.com/DEWjT4Vy9o
— ANI (@ANI) April 26, 2024