ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో లేకపోవడంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. స్కూళ్లలో అవసరమైన విద్యా సామగ్రి లేకపోవడాన్ని చూస్తుంటే విద్యార్థులను కనీసం పట్టించుకోనట్లు కనిపిస్తోందని కోర్టు తీవ్రంగా మందలించింది. జ్యుడీషియల్ కస్టడీ నుంచి పాలన సాగించడం పట్లపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఇది కూడా చదవండి: Off The Record: ఇద్దరినీ పక్కన పెట్టడంతో కేడర్‌లో అసహనం.. కంచుకోటకు బీటలు పడే ముప్పు ముంచుకొచ్చిందా?
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంల పంపిణీకి సంబంధించి.. నేరుగా జోక్యం చేసుకునే అధికారం తమ పరిధిలో లేదని కోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వ బాధ్యతల్లో లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నందున సమస్యను పరిష్కరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం తమ బాధ్యతల్లో విఫలమైనందునే జోక్యం చేసుకోవల్సి వస్తుందని న్యాయస్థానం పేర్కొంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. అక్కడ నుంచే ప్రస్తుతం కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తున్నారు. బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్న లభించడం లేదు. ఇంకోవైపు షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. ఇన్సులిన్ అందించాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు. దీనిపై కూడా తీర్పు రాలేదు. తాజాగా ఎంసీడీ స్కూళ్ల తీరుపై హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. దీనిపై ఆప్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Jammu kashmir: రాంబన్ జిల్లాలో కుంగిన భూమి.. దెబ్బతిన్న 30 ఇళ్లు