Ex CM: మాజీ ముఖ్యమంత్రి ఇలా అయిపోయారేంటి..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయనో ఓ రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి. ఎంతో దర్పం.. హోదా అనుభవించిన ఆయన.. కొద్ది రోజులు క్రితం అవినీతి కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మూడు, నాలుగు నెలల నుంచి కారాగారంలో ఉంటున్నారు. హఠాత్తుగా సోమవారం జనాల మధ్య ప్రత్యక్షమయ్యారు. ఆయనను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎప్పుడూ సేవింగ్ చేసుకుని నీటుగా కనిపించే రాజకీయ నాయకుడు.. ఒక్కసారిగా గడ్డంతో కనిపించే సరికి పలువురు అయోమయానికి గురయ్యారు. ఇంతకీ ఆయనెవరు? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
హేమంత్ సోరెన్.. పరిచయం అక్కర్లేని భారతీయ రాజకీయ నాయకుడు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి. ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు, నాలుగు నెలల నుంచి ఆయన జైల్లో ఉంటున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టులో.. హైకోర్టులో పిటిషన్ వేసినా ఊరట లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఇదిలా ఉంటే ఇటీవల హేమంత్ సోరెన్ మామ రాజారామ్ సోరెన్ చనిపోయారు. సోమవారం ఆయనది కర్మ కార్యక్రమం ఉంది. ఇందుకోసం ఈ వేడుకలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన్ను చూసిన వారంతా షాక్ అయ్యారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఫుల్ గడ్డం పెంచేశారు. మెరిసి పోయిన గడ్డం ఉండడంతో కొందరు కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఇక ఆయన్ను చేసిన అభిమానులు, కార్యకర్తలు ఫొటోలు, సెల్పీలు దిగేందుకు ఎగబడ్డారు. హేమంత్ కూడా ఫొటోలు దిగేందుకు అవకాశం కల్పించారు.
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్

భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో జనవరిలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కస్టడీ తర్వాత కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో జైలుకు తరలించారు. బెయిల్‌కు అప్లై చేసినా ఊరట లభించలేదు. తాజాగా మామ కర్మ వేడుకకు కోర్టు అనుమతి ఇచ్చింది.
ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జార్ఖండ్‌లో జరుగుతున్న శాసనసభ ఉపఎన్నికల్లో ఆమె పోటీ చేస్తున్నారు. ఆమెకు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది.
#WATCH | Ramgarh, Jharkhand: Former CM Hemant Soren attends the 'shradh-karma' ceremony of his uncle Rajaram Soren in Ramgarh
Jharkhand High Court had allowed him to attend the ceremony. Soren is currently under judicial custody after he was arrested by ED in a money laundering… pic.twitter.com/1VP7Qn6QiT
— ANI (@ANI) May 6, 2024
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!