గాంధీ కుటుంబానికి అమేథీ ప్రజలు గొప్ప విజయాన్ని అందించారని కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్.శర్మ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కేఎల్. శర్మ ఓడించారు. 2019లో అమేథీలో స్మృతి ఇరానీ విజయం సాధించారు
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని నితీషా కందుల(23) క్షేమంగా ఉన్నట్లు యూఎస్ పోలీసులు తెలిపారు. మే 28న నితీషా అదృశ్యమైంది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలోని శాన్ బెర్నార్డినోలో ఆమె మాస్టర్స్చేస్తోంది. ఆమె ఆచూకీ కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.
పంజాబ్‌లో వేర్పాటువాది అమృత్‌పాల్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై 1.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి విక్టరీ సాధించారు.
టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం రాజీనామా లేఖను టీటీడీ ఈవోకు పంపించారు. గత ఆగస్టు నెలలో టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని మరోసారి బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గెలుపొందారు. మొత్తం 10,42,493 ఓట్లు పొలైయ్యాయి. కిషన్‌రెడ్డికి 4,72,012 ఓట్లు వచ్చాయి. మొత్తం 49,944 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు ఒకెత్తు అయితే.. ఇండోర్‌లో మాత్రం మరొకెత్తు. ఇక్కడ బీజేపీ అభ్యర్థితో నోటా పోటీ పడడం విశేషం. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయాన్ని సాధించింది. ఊహించని రీతిలో విక్టరీ దిశగా సాగిపోతుంది. ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భారీ విజయం నమోదు చేశారు. 70 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: KK Survey: కిక్కెకించిన ‘కేకే’ సర్వే.. కూటమి సునామీని బాగానే అంచనా వేసాడుగా.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సోదరుడు […]
జూన్ 4.. ఇక స్టాక్ మార్కెట్లకు మంచిరోజులొస్తాయని.. ఇక తిరుగులేదని.. ఎన్నెన్నో కథనాలు.. ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ అంచనాలన్నీ పటాపంచలయ్యాయి. ఎన్నికల ఫలితాలతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ఢమాల్ అయిపోయాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కేంద్ర ప్రభుత్వం హింస్తోందని ఆప్ మంత్రి అతిశీ ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. జైల్లో కేజ్రీవాల్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించేందుకు మోడీ ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు.