దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు ఒకెత్తు అయితే.. ఇండోర్‌లో మాత్రం మరొకెత్తు. ఇక్కడ బీజేపీ అభ్యర్థితో నోటా పోటీ పడడం విశేషం. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఇక బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఆయన 10, 08, 077 లక్షల మెజార్టీతో భారీ విజయం సాధించారు. ఈ స్థానం నుంచి మొదట పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. లోక్‌సభ చరిత్రలో ఇప్పటివరకు బీజేపీ నాయకురాలు ప్రీతమ్ ముండే పేరుతో అత్యధిక మెజార్టీ రికార్డు (6.9లక్షలు) ఉండగా.. తాజాగా ఆ రికార్డును శంకర్ లల్వానీ బద్ధలుకొట్టారు. ఇక ఈ నియోజకవర్గంలో రెండో స్థానంలో నోటా ఉంది. దాదాపు రెండు లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. దీంతో ఇండోర్‌లో నోటాకు అత్యధికంగా ఓట్లు పడిన స్థానంగా రికార్డుకెక్కింది.