తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రెండు చోట్ల రాహుల్ గాంధీ అనూహ్యమైన విజయాన్ని సాధించారు. విక్టరీనే కాదు.. భారీ మెజార్టీ కూడా సాధించారు. దీంతో ఆయన గురించి తాజాగా చర్చ సాగుతోంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత రెండు కూటమిల మధ్య ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమిలు దెబ్బ దెబ్బగా సీట్లు సాధించాయి. బీజేపీ సొంతంగా ఎక్కువ సీట్లు సాధించకపోయినా.. మిత్ర పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.
తాజాగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఊహించని విధంగా స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. జైలు నుంచి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు విక్టరీ సాధించారు. దీంతో దేశ వ్యాప్తంగా వీరిద్దరి గురించి చర్చ జరుగుతోంది.
లెబనాన్ రాజధాని బీరూట్‌లోని యూఎస్ రాయబార కార్యాలయం సమీపంలో బుధవారం కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సిరియన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సిబ్బంది సురక్షితంగా ఉన్నారని లెబనాన్ సైన్యం తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలంతా సమావేశం అయ్యారు. సోనియా, రాహుల్, ప్రియాంక, తమిళనాడు సీఎం స్టాలిన్, శరద్ పవార్, సంజయ్ రౌత్, తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్, తదితరలు పాల్గొన్నారు.
ఎన్డీఏ పక్షనేత మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బలపరచగా.. కూటమి పక్ష నేతలంతా ఏకగ్రీవంగా మోడీని ఎంచుకున్నారు. మంగళవారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది.
జర్మనీని భారీ వరదలు ముంచెత్తాయి. దక్షిణ జర్మనీలోని బవేరియాలో ఈ వరదలు ముంచెత్తాయి. ఈ వరదలు కారణంగా ఇప్పటివరకు ఐదుగురు చనిపోయారు. అలాగే కార్లు కొట్టుకుపోయాయి. నివాస ప్రాంతాలు జలమయ్యాయి.
మొత్తానికి భారీ నష్టాల్లోంచి దేశీయ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వచ్చాయి. బుధవారం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ముగింపు వరకు యధావిధిగా కొనసాగాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీ లజ్‌పత్‌నగర్‌లోని కంటి ఆస్పత్రికిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐ7 చౌదరి ఐ సెంటర్లో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలికి చేరుకుని 16 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు.
ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి విక్టరీ సాధించారు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడారు.