ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కేంద్ర ప్రభుత్వం హింస్తోందని ఆప్ మంత్రి అతిశీ ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. జైల్లో కేజ్రీవాల్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించేందుకు మోడీ ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Nagpur: 2019 అత్యాచారం, హత్య ఘటన.. నిందితుడికి మరణశిక్ష
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్‌కు 21 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1తో గడువు ముగియడంతో జూన్ 2 (ఆదివారం) తీహార్ జైల్లో లొంగిపోయారు. తాజాగా మంత్రి అతిశీ ఈ ఆరోపణలు చేయడం కలకలం రేపుతున్నాయి. మంగళవారమే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఆరోపణలు చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: CM Jagan: కౌంటింగ్ ఏజెంట్లు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్ సూచన
జైల్లో కేజ్రీవాల్ హింసకు గురవుతున్నారని మంత్రి తెలిపారు. ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు జైలు సిబ్బందితో కలిసి మోడీ సర్కార్ కుట్ర పన్నుతోందన్నారు. ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయని.. కానీ కేజ్రీవాల్ ఉన్న సెల్‌లో కనీసం కూలర్‌ను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఆయన ఆరోగ్యంతో బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మంత్రి ధ్వజమెత్తారు. తమ నాయకుడి పట్ల ఇలా ప్రవర్తించడాన్ని ఢిల్లీ ప్రజలు సహించలేరని అతీశీ పేర్కొన్నారు. బీజేపీ చర్యలను ఎన్నటికీ మరచిపోలేరని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైల్లో పెట్టారు. ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఉందని బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆయనకు 21 రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ గడువు జూన్ 1తో ముగిసింది. దీంతో ఆయన ఆదివారం (జూన్ 2) తీహార్ జైల్లో లొంగిపోయారు.
ఇది కూడా చదవండి: Israel: ఇజ్రాయెల్ కీలక ప్రకటన.. లక్షద్వీప్ వెళ్లొచ్చంటూ పోస్టు