గాంధీ కుటుంబానికి అమేథీ ప్రజలు గొప్ప విజయాన్ని అందించారని కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్.శర్మ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కేఎల్. శర్మ ఓడించారు. 2019లో అమేథీలో స్మృతి ఇరానీ విజయం సాధించారు. అప్పుడు రాహుల్ గాంధీని ఓడించారు. 2024 ఎన్నికల్లో అమేథీలో ఈసారి రాహుల్ కాకుండా.. గాంధీయేతర వ్యక్తి అయిన శర్మను బరిలోకి దింపింది. అనూహ్యంగా కేఎల్.శర్మ అమేథీలో విక్టరీ సాధించారు. దాదాపు లక్షకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: Nara Lokesh: బాధ్యత మరింత పెరిగిందన్న నారా లోకేష్..
కేఎల్.శర్మ.. గాంధీ కుటుంబానికి విధేయుడు. అమేథీ కాంగ్రెస్‌కు కంచుకోట. 25 ఏళ్ల అనుబంధం ఉంది. తొలిసారి గాంధీయేతర వ్యక్తి విజయం సాధించాడు. శర్మకు ప్రియాంక గాంధీ అభినందనలు తెలిపారు. మీరు గెలుస్తారని మొదటి నుంచి తెలుసు అని చెప్పారు. మీకు అండగా నిలిచిన అమేథీ ప్రజలకు ధన్యవాదలు చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఎన్డీఏకు 292, ఇండియా కూటమికి 232 స్థానాలు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి 272 స్థానాలు అవసరం ఉంటాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమే విజయం సాధించింది.
ఇది కూడా చదవండి: Narendra Modi: మూడోసారి ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారు..