పరువు నష్టం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు బెయిల్ లభించింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో ఇద్దరికి ఊరట లభించింది.
సార్వత్రిక ఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌పై జరిగే చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు. శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడు విడతల పోలింగ్, కౌంటింగ్, ఎగ్జిట్ పోల్స్‌పై చర్చించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో శుక్రవారం ప్రజల్వ్ తల్లికి దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. విచారణకు అందుబాటులో ఉండాలని కోరింది.
గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వేడితో అల్లాడిపోతుంది. ఇప్పటికే 52 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకోవైపు నీటి సమస్యతో బాధపడుతోంది. మరికొన్ని రోజులు హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని కేంద్ర వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాబోయే ఐదు రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వాతావరణ శాఖ రాష్ట్రాల లిస్టు విడుదల చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం అయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో భారత కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కూటమిలో ఉన్న పార్టీ అధినేతలు, నాయకులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన రెండు పిటిషన్లలో ఉపశమనం లభించలేదు. సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర బెయిల్ కొనసాగించాలని.. వైద్య పరీక్షల కోసం రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్లు వేసుకున్నారు.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. శనివారం చివరి విడత పోలింగ్ జరగనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ నిర్వహించిన దాడుల్లో దేశ వ్యాప్తంగా భారీ మొత్తంలో నగదు, నగలు స్వాధీనం చేసుకుంది.
శనివారం దేశ వ్యాప్తంగా చివరి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది.