బీహర్‌లో మరికాసేపట్లో మలి విడత పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు.
అగ్రరాజ్యం అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆంధప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య ‘కుర్చీ’ వివాదం నడుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రెండు వర్గాలు విడిపోయారు. ప్రస్తుతం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణమే నెలకొన్నట్లు తెలుస్తోంది.
కేరళలోని కొచ్చి అకస్మాత్తుగా జలఖడ్గం విరుచుకుపడింది. తుఫాన్ కారణంగానో.. లేదంటే భారీ వరదలు కారణంగానో కాదు. ఊహించని రీతిలో అర్ధరాత్రి వచ్చిన పెను ముప్పు కారణంగా మొత్తం ఇళ్లను ముంచేశాయి. దీంతో వాహనాలు, వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణాపాయం తప్పినా.. భారీగా నష్టమైతే జరిగింది.
బీహార్‌లో మంగళవారమే మలి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పోలింగ్ సిబ్బంది కూడా బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో అల్‌ఖైదా, ఐసిస్ ఉగ్రవాదం పెచ్చుమీరుతోంది. ఇక్కడ సైన్యానికి-ఉగ్రవాదుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఐసిస్ దాడులు ఎక్కువగా పెరిగిపోయాయి.
భోపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆసియా కప్ బంగారు పతక విజేతతో సహా సహచర భారత నేవీ కయాకర్ ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో భారీ ఉగ్ర కుట్ర కోణం బయటపడింది. ఒక వైద్యుడి ఇంట్లో 300 కేజీల ఆర్డీఎక్స్, ఒక ఏకే-47 రైఫిల్, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడు కాశ్మీర్‌కు చెందిన ముజాహిల్ షకీల్‌గా గుర్తించారు. జమ్మూకాశ్మీర్ ఏటీఎస్ పోలీసుల ఆపరేషన్‌లో ఈ ఉగ్ర కుట్ర బయటపడింది.
ఒడిశాలోని జాజ్పూర్లో కీటకాల గుంపు వాహనదారులను, ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పెద్ద ఎత్తున కీటకాల దండు తరలిరావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళ్లల్లో పడడంతో బైకర్లు బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయారు. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.