Viral video: బాబోయ్.. ఇవేం కుక్కలు.. బెంబేలెత్తిపోయిన డెలివరీ బాయ్
- మనుషుల ప్రాణాలు తోడేస్తున్న కుక్కలు
- తాజాగా రాయ్‌పూర్‌లో డెలివరీ బాయ్‌పై ఎటాక్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా కుక్కలు విజృంభిస్తున్నాయి. ఎక్కడో చోట కుక్కల దాడిలో చిన్న పిల్లల దగ్గర నుంచీ.. పెద్దోళ్లు వరకు గాయపడుతునే ఉంటున్నారు. రోడ్ల మీదకు రావాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. రహదారుల ప్రక్కన.. కాచు కూర్చుని అమాంతంగా వాహనదారులపై ఎటాక్ చేస్తున్నాయి. ఇక చిన్న పిల్లలు ఒంటరిగా కనిపిస్తే.. ప్రాణాలు పోయే దుస్థితి ఏర్పడింది. ఈ మధ్య హైదరాబాద్‌లో అయితే బాలుడి ప్రాణాలే పోయాయి. ఈ ఘటనే కాదు.. దేశంలో ఆయా ప్రాంతాల్లో గ్రామ సింహాల మారణహోమానికి ప్రజల ప్రాణాలు బలిపోతున్నాయి. రక్షణ కల్పించాల్సి ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతున్నాయి. అంతా అయిపోయాక.. తీరిగ్గా చర్యలు చేపడుతున్నారు. చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసిన సంఘటన తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఓ డెలివరీ బాయ్‌ను కండలు.. కండలు ఊడేలా పెంపుడు కుక్కలు పీక్కుతున్నాయి. రక్షించండి.. రక్షించండి అంటూ మొర్ర పెట్టుకున్నా.. కాపాడిన నాథుడే కనిపించలేదు. ఎవరో మాత్రం మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియో చూస్తుంటే మాత్రం గుండెలు అదిరిపోతున్నాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Vangalapudi Anitha: టీడీపీ, వైసీపీ పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలి..
Also Read
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ఓ వైద్యుడి ఇంట్లో ఫుడ్ డెలివరీ చేసేందుకు బాయ్ వెళ్లాడు. అంతే అమాంతంగా మూడు పెంపుడు కుక్కలు ఎటాక్ చేశాయి. వాటి నుంచి విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా వదలలేదు. దీంతో అతడు కాపాడండి.. కాపాడండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తున్న పట్టించుకున్న పాపాన పోలేదు. కండలు ఊడేలా పీక్కుతున్నాయి. మొత్తానికి ఎలాగోలా వాటి బారి నుంచి బయటపడి.. రోడ్డుపై ఉన్న కారు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే ఎవరో మాత్రం ఈ సంఘటనను మొబైల్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోలో ప్యాంట్ చిరుగుపోయింది. కాళ్లు, చేతుల నుంచి రక్తం కారుతున్న దృశ్యాలు కనిపించాయి. అంతా అయిపోయాక.. ఎవరో ఒక వ్యక్తి.. మంచినీళ్లు ఇచ్చాడు.. అనంతరం మరో లేడీ.. రక్తం కారకుండా బట్ట తీసుకొచ్చి కట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. మున్సిపల్ అధికారులపై దుమ్మెత్తిపోస్తున్నారు. కుక్కల యజమానిని జైల్లో పెట్టాలని… వైద్య ఖర్చులతో పాటు.. కుటుంబ పోషణకు నిందితుల నుంచి వసూలు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇక బాధితుడు సల్మాన్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనపై కుక్కలు దాడి చేసినా.. ఎవరు పట్టించుకోలేదని వాపోయాడు. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
A delivery boy named Salman Khan was attacked by a Pitbull in Raipur.
I hope action will be taken against the owners in this case.
Govt of India has recently banned sale and breeding of Pitbull & 23 other dangerous dog breeds in India. pic.twitter.com/n2pK55jeYw
— Incognito (@Incognito_qfs) July 16, 2024
తాజావార్తలు
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!