మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తు్న్నాయి. ఆయా ప్రాంతాలు చిత్తడి చిత్తడిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో రీల్స్ చేయడానికి ప్రయత్నించిన ఒక ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రాయ్‌గఢ్ సమీపంలోని కుంభే జలపాతం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Trump: అచ్చం అలాగే.. ట్రంప్‌పై దాడిని చిత్రీకరించిన ఆఫ్రికా చిన్నారులు.. వీడియో వైరల్
26 ఏళ్ల ఇన్‌స్ట్రాగామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్‌దార్.. ఒక లోయ దగ్గర రీల్స్ చేస్తోంది. అయితే సడన్‌గా కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయింది. వీడియో తీస్తుండగా ఆమె లోయలో పడిపోయింది.
ఇది కూడా చదవండి: SBTET : మాన్యువల్ టైప్ రైటింగ్ కోర్సును నిలిపివేయాలనే యోచనలో SBTET
జూలై 16న ఆన్వీ.. తన స్నేహితులతో కలిసి కంభే జలపాతం దగ్గరకు వెళ్లింది. రీల్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు లోయలోపడింది. లోతైన సందులోకి జారి పడింది. స్థానిక అధికారులు త్వరితగతిన రంగంలోకి దిగారు. కోస్ట్ గార్డ్, కోలాడ్ రెస్క్యూ టీమ్, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సిబ్బంది బయటకు తీశారు. భారీ వర్షం కారణంగా ఆమె తీవ్రంగా గాయపడిందని తెలిపారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను మనగావ్ సబ్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందని పోలీసులు వెల్లడించారు. విహారయాత్ర.. విషాదంగా మారడంతో స్నేహితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.
ఇది కూడా చదవండి: Off The Record : కాంగ్రెస్లోకి అలంపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చల్లా.?