ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత అనేక కథనాలు వెలువడ్డాయి. కొందరు ఆత్మాహుతి దాడి అని.. ఇంకొందరు పొరపాటున కారు బ్లాస్ట్ జరిగిందని వాదనలు వినిపించాయి. ఇలా రకరకాలైన కథనాలు వచ్చాయి.
ఢిల్లీ పేలుడు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఉదయం ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందాలు దాడులు చేస్తున్నాయి. యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం, 25 ప్రదేశాలపై ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ మధ్య నిన్నామొన్నటి దాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉండేది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల ముందు ఓ రేంజ్లో ట్రంప్ విరుచుకుపడ్డారు. మమ్దానీని నోటికొచ్చినట్లు మాట్లాడారు.
వామ్మో.. ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే సంగతులు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా దేశ వ్యాప్తంగా కారు బ్లాస్ట్‌లకు డాక్టర్ల బృందం ప్రణాళికలు రచించినట్లుగా అనుకున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి వైఫల్యంతో ఇండియా కూటమిలో కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది. అఖిలేష్ యాదవ్‌కు ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించాలంటూ వాదన వినిపిస్తోంది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు వెలువరించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న కేసులో షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది.
ఢిల్లీ బ్లాస్ట్ వెనుక తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అనేక కీలక విషయాలు రాబట్టిన అధికారులు.. తాజాగా మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. దేశ వ్యా్ప్తంగా అనేక చోట్ల పేలుళ్లు చేసేందుకు డాక్టర్ ఉమర్‌తో కలిసి డాక్టర్ షాహీన్ కుట్ర చేసిందని తేల్చారు.
వామ్మో.. దేశాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. మొన్నటిదాకా వర్షాలు.. ఇప్పుడేమో చలి ఠారెత్తిస్తోంది. గత కొద్దిరోజులుగా చలి తీవ్రత గజగజవణికిస్తోంది. బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
అమెరికాతో వాణిజ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఎల్పీజీ దిగుమతిపై అమెరికాతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ వెల్లడించారు.