వామ్మో.. ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే సంగతులు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా దేశ వ్యాప్తంగా కారు బ్లాస్ట్‌లకు డాక్టర్ల బృందం ప్రణాళికలు రచించినట్లుగా అనుకున్నారు. కానీ తాజాగా జమ్మూ కాశ్మీర్ నివాసి జాసిర్ బిలాల్ వాని అలియాస్ డానిష్‌ను అరెస్టు చేశాక.. అంతకు మంచిన కుట్ర జరిగినట్లుగా దర్యాప్తులో తేలింది.
ఇది కూడా చదవండి: Sheikh Hasina: షేక్ హసీనాకు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకించిన ఐక్యరాజ్యసమితి..
అక్టోబర్ 7, 2023.. ఈ తేదీ గుర్తుందా? మరిచిపోయే డేట్ కాదు. ఇజ్రాయెల్ చరిత్రలో చీకటి రోజు. హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. సేమ్… ఇదే తరహాలో ఉగ్ర డాక్టర్ల బృందం కూడా భారత్‌పై విరుచుకుపడాలని కుట్ర పన్నినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ మేరకు డానిష్ అరెస్ట్ తర్వాత ఈ కొత్త కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది.
డానిష్.. జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ఖాజిగుండ్ నివాసి. శ్రీనగర్‌లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఇతడు డ్రోన్ నిపుణుడిగా గుర్తించారు. డ్రోన్ల ద్వారా అత్యంత శక్తివంతమైన బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాడు. డాక్టర్ ఉమర్‌తో కలిసి ఈ ప్రణాళిక రచించాడు. టెర్రర్ మాడ్యూల్‌లో డానిష్ కూడా ఒక కుట్రదారుడు. ఇతడు డ్రోన్లు, రాకెట్ల ద్వారా ఎలా శక్తివంతమైన బాంబులు పేల్చవచ్చో.. అందుకు సంబంధించిన సాంకేతిక సహాయాన్ని డానిష్ అందించాడు. ఆల్రెడీ బరువైన బాంబులను మోయగలిగే పెద్ద బ్యాటరీలతో అమర్చబడిన డ్రోన్లు తయారు చేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. గతంలో చిన్న ఆయుధాలను తీసుకెళ్లే డ్రోన్లను డానిష్ తయారు చేశాడు. తాజాగా పెద్ద ఎత్తున బాంబులు తీసుకెళ్లే డ్రోన్లను తయారు చేస్తు్న్నాడు. ఈ డ్రోన్ టార్గెట్ రద్దీగా ఉన్న ప్రాంతంలో ప్రయోగించడమే. హమాస్ ఉగ్రవాదులు కూడా ఇజ్రాయెల్‌పై ఇదే తరహాలో ప్రయోగించారు. అలాగే సిరియాలో కూడా ఇతర సంస్థలు కూడా ఇలానే ప్రయోగించాయి. సేమ్.. అదే తరహాలో డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా దాడులు చేయాలని డానిష్, ఉమర్ కుట్ర పన్నినట్లుగా దర్యాప్తు సంస్థలు కనిపెట్టాయి.
ఇది కూడా చదవండి: Priyanka Chopra : చీరలో ప్రియాంక చోప్రా.. కత్తిలాంటి అందాలు చూశారా
డ్రోన్ కుట్రలో భాగంగా గతేడాది అక్టోబర్‌లో కుల్గామ్‌లోని ఒక మసీదులో డానిష్-ఉమర్ కలిసినట్లుగా గుర్తించారు. అక్కడ నుంచి ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి తన వసతి గృహానికి ఉమర్ తీసుకెళ్లాడు. ఇక్కడే ఉమర్‌ను.. అతని బృందాన్ని డానిష్ ఉగ్రవాదంపై బాగా మైండ్ వాష్ చేసినట్లుగా తెలుస్తోంది. నిషేధిత జైష్-ఎ-మొహమ్మద్ (JeM) కోసం ఓవర్-గ్రౌండ్ వర్కర్ (OGW)గా పనిచేయాలని కోరాడు. ఇక ఉమర్‌ను అయితే ఆత్మాహుతి మిషన్ నిర్వహించాలని డానిష్ ప్రేరేపించాడు. అయితే ఇస్లాం ప్రకారం ఆత్మహత్య నేరం అంటూ ఆ ప్రణాళిక నుంచి ఉమర్ వైదొలిగాడు. దీంతో డ్రోన్ నిర్వహణలో సాంకేతిక నిపుణుడు కాబట్టి ఆ దిశగా ఉమర్‌ను డానిష్ పురికొల్పాడు. జేఎం సహాయంతో ఆర్థిక వనరులు కూడా కూడబెట్టాడు. డిసెంబర్ 6 కోసం ప్రణాళిక రచించుకుంటూ ఉండగా ఇంతలో సన్నిహితుడు డాక్టర్ ముజిమ్ముల్ అరెస్ట్ అయ్యాడు. దీంతో ఉమర్ భయాందోళనకు గురయ్యాడు. అయితే కారులో సరిగ్గా అమర్చలేని ఐఈడీ బాంబ్ ఒక్కసారిగా ఎర్రకోట దగ్గర పేలిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. ఈ కారు బ్లాస్ట్‌తో మొత్తం దేశ వ్యాప్తంగా డాక్టర్ల బృందం రచించిన ఉగ్ర కుట్ర బయటపడింది.
నవంబర్ 10న ఢిల్లీ కారు బ్లాస్ట్ జరిగి ఉండకపోతే మాత్రం డిసెంబర్ 6న దేశ వ్యాప్తంగా మారణహోమమే జరిగి ఉండేదని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. పెద్ద ఎత్తున హమాస్ ఉగ్రవాదుల తరహాలో దేశంలో బాంబ్ దాడులు జరిగేవని అధికారులు పేర్కొన్నారు. పెద్ద వినాశనం తప్పినట్లుగా అధికారులు భావిస్తున్నారు.