Suresh Maddala
Author- NTV Telugu-
Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
అసోంలో భారీ ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. ఒకేసారి పెద్ద గుంపు రైల్వే పట్టాలపైకి వచ్చేశాయి. దీంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై రైల్వే శాఖను అలర్ట్ చేశారు. దీంతో గజరాజులు రైల్వే పట్టాలను దాటుతుండగా ఢిల్లీ-డిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. -
Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్-యోగా గురువు బాబా రామ్‌దేవ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పరస్పరం మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. ఇటీవల జెన్-జీని ఉద్దేశించి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మురికి కాలువ తరం’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. -
Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం తమిళనాడులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రేపు అమిత్ షా అధ్యక్షతన 31వ దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం తమిళనాడులోని మామల్లపురంలో జరగనుంది. -
Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టిక్రీ కలాన్ ప్రాంతంలోని ఓ ఫ్యూయల్ పంప్లో ట్రక్కు సీఎన్జీ సిలిండర్ పేలిపోయింది. వాహనంలో సీఎన్జీ నింపుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. -
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
జెన్-జీ యువతతో మరింత మమేకమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోజుకో యూనివర్సిటీని సందర్శించి.. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. -
Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చితే యూరప్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక వసతులపై దాడులు చేసే అవకాశాలను ఇరాన్ పరిశీలిస్తున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. -
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై పశ్చిమ బెంగాల్‌లోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు సమన్లను పలుమార్లు జారీ చేసినప్పటికీ.. ఆమె విచారణకు హాజరుకాకపోవడంతో ఈ చర్యలు తీసుకుంది. -
CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
సీజేఐ సూర్యకాంత్‌పై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్ ప్రశంసలు కురింపించారు. ‘‘తండ్రిలాంటి వ్యక్తి.. ఎప్పుడైనా సంప్రదించగలిగే వ్యక్తి’’గా అభివర్ణించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రదీప్ రాయ్ భారీ ఘన విజయం అందుకున్నారు. -
Trump: ట్రంప్‌తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫొటో దిగడమంటే మామూలు విషయం కాదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతాలో ఉంటారు. అలాంటిది ట్రంప్ దగ్గరకు వెళ్లి ఫొటో దిగడం అంటే ఆషామాషీ కాదు. -
Central Cabinet Decision: ఏపీకి రైల్వే ప్రాజెక్ట్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మౌలిక వసతుల అభివృద్ధిపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రూ.13,041 కోట్ల విలువైన ఐదు భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
తాజావార్తలు
-
Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డు.. ఆ జాబితాలోకి చేరిక..
-
Chaitanya Reddy: ‘హనుమాన్’ ఎవరి సొంతం కాదు.. మా దగ్గరా డాక్యుమెంట్స్ ఉన్నాయి!
-
Renu Desai: ఆడవాళ్లేమీ రోబోలు కాదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravindra Jadeja: టీమ్‌లో చోటు దక్కలేదని డాక్టర్‌గా మారిన జడేజా.. స్టెతస్కోప్‌తో ఏం చేశాడో చూడండి (వీడియో)
-
Rajini – Kamal Multistarrer: రజినీ, కమల్ మల్టీస్టారర్ ఉన్నట్టా ? లేనట్టా?
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!