SpiceJet: షాకింగ్ ఘటన.. గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్.. ప్రయాణికులు హడల్
- గోవా-పూణె విమానంలో షాకింగ్ ఘటన
- గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్
- ప్రయాణికుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో విమాన ప్రయాణమంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఆ భయం మరింత ఎక్కువైంది. ప్యాసింజర్స్‌లో ఇలాంటి భయాలు నెలకొన్న నేపథ్యంలో ఎయిర్స్‌లైన్స్‌లు ఎంత అప్రమత్తంగా ఉండాలి. కానీ తాజాగా ఘటనతో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. గోవా నుంచి పుణెకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం.. గాల్లో ఉండగా కిటికీ ఫ్రేమ్ హఠాత్తుగా ఊడిపోయింది. దీంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Lucknow: భార్య కాపురానికి రావడం లేదని.. అత్తమామలపై అల్లుడు దారుణం..
Also Read
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
మంగళవారం స్పైస్‌జెట్‌కు చెందిన SG1080 విమానం గోవా నుంచి పూణెకు వెళ్తోంది. గాల్లో ఉండగా అకస్మాత్తుగా కిటికీ ఫ్రేమ్ ఊడిపోయింది. ఈ సంఘటనతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక ప్రయాణికుడు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇది కూడా చదవండి: Rashmika : ఇండస్ట్రీలో కెరీర్‌ను నిలబెట్టుకోవడమే అసలైన యుద్ధం..
ఇక పూణె విమానాశ్రయంలో విండో ఫ్రేమ్‌ను సరి చేసినట్లు స్పైస్‌జెట్ తెలిపింది. ప్రయాణికుల భద్రతకు ఎటువంటి నష్టం జరగలేదని పేర్కొంది. ప్రయాణికుల భద్రతకు ఏ విధంగానూ రాజీ పడబోమని చెప్పింది. విమానం అంతటా క్యాబిన్ ప్రెజరైజేషన్ బాగానే ఉందని.. కిటికీ ఫ్రేమ్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది.
అయితే కిటికీ ఫ్రేమ్ ఊడిపోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు చేయకుండా విమానాలను ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల భద్రత ఎయిర్‌లైన్స్‌కు పట్టవా? అని నిలదీస్తు్న్నారు. అసలు ఇలాంటి విమానాలు ఎగిరే అర్హత ఉందా? అని మరికొందరు ప్రశ్నిస్తు్న్నారు.
#SpiceJet from Goa to Pune today. The whole interior window assembly just fell off mid flight. And this flight is now supposed to take off and head to Jaipur. Wonder if it’s air worthy @ShivAroor @VishnuNDTV @DGCAIndia pic.twitter.com/x5YV3Qj2vu
— Aatish Mishra (@whatesh) July 1, 2025
తాజావార్తలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!