చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అదృశ్యం కలకలం రేపింది. దాదాపు ఆయన 15 రోజులు మిస్సింగ్ అయ్యారు. మే 21 నుంచి జూన్ 5 వరకు కనిపించలేదు. ఈ వార్త దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అయితే అధ్యక్షుడి మార్పునకు ఇది సంకేతం అంటూ ప్రచారం జరుగుతోంది. ఆయనపై నిశ్శబ్ద తిరుగుబాటు జరిగిందంటూ పుకార్లు నడుస్తున్నాయి. తదుపరి అధ్యక్షుడిగా వాంగ్ యాంగ్ రాబోతున్నారంటూ నిఘా వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Shekar Kammula : నెక్స్ట్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
జిన్‌పింగ్ నిత్యం ఏదొక కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉండేవారు. బీజింగ్‌లోని గ్రాండ్ హాళ్లలో ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు కవాతులు లేవు, స్పాట్‌లైట్లు లేవు. ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. అంటే జిన్‌పింగ్‌ను పక్కన పెట్టినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా అదృశ్యం కావడం ఇదేమీ కొత్త కాదని.. గతంలో కూడా చాలా సార్లు మిస్సింగ్ అయినట్లు సమాచారం. ఏదేమైనా చైనాలో ఏదో జరుగుతోందని వదంతులు నడుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Thammudu : శిరీష్ నోటి దూల.. ‘తమ్ముడు’కి తిప్పలు తెచ్చింది